Janasena: ఏపీలో వేడెక్కిన రాజకీయం.. జనసేనలో భారీగా చేరికలు..
జనసేన పార్టీలో చేరికలు ఊపందుకుంటున్నాయి. జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి కొణతాల, ఎంపీ బాలశౌరి అనౌన్స్ చేశారు. పవన్ కల్యాణ్ పోరాట పటిమ, జనసేన సిద్ధాంతాలు తమను ఎంతగానో ఆకర్షించాయని చెప్పారు. కొణతాలను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు పవన్ కల్యాణ్.
జనసేన పార్టీలో చేరికలు ఊపందుకుంటున్నాయి. జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి కొణతాల, ఎంపీ బాలశౌరి అనౌన్స్ చేశారు. పవన్ కల్యాణ్ పోరాట పటిమ, జనసేన సిద్ధాంతాలు తమను ఎంతగానో ఆకర్షించాయని చెప్పారు. కొణతాలను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు పవన్ కల్యాణ్.
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు వేడేక్కాయి. జనసేనపార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు సీనియర్ నేతలు పవన్ కల్యాణ్ నాయకత్వానికి జై కొడుతున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ ను కలిసిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతున్నట్లు తాజాగా ప్రకటించారు. అనకాపల్లిలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో జనసేనలో చేరుతున్నట్లు కొణతాల రామకృష్ణ వెల్లడించారు. 2014లో వైసీపీకి రాజీనామా చేసిన కొణతాల.. ఇంతవరకు ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు. తాజాగా జనసేనపార్టీ సిద్ధాంతాలు, పవన్ పోరాట పటిమ నచ్చి తాను జనసేనలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు కొణతాల.
మరోవైపు YS కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి.. జనసేనపార్టీలో చేరనున్నారు. త్వరలోనే మంచిరోజు చూసుకుని జనసేనలో చేరతానని బాలశౌరి అనౌన్స్ చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ను కలిసి చర్చించానని.. ఆయన మంచి ఆలోచనా విధానం ఉన్న వ్యక్తి అని చెప్పారు. కుటుంబసమేతంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు బాలశౌరి. కొణతాలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జనసేన పార్టీ అధినేత. తమ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకోవడం హర్షనీయం అన్నారు పవన్ కల్యాణ్. అయితే రానున్న రోజుల్లో జనసేనలో మరిన్నిచేరికలు ఉంటాయని అటు ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి.