Worlds largest lock: అయోధ్య చేరుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం, బాలరాముడికి భారీ లడ్డూ ప్రసాదం..

ఈ భారీ లడ్డూను జీడిపప్పు, బాదం, ఇతర పండ్లతో అలంకరించారు. పగిలిపోని విధంగా ఈ లడ్డూను తయారు చేశారు. ఈ లడ్డూ చెడిపోకుండా ఉండేందుకు హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఫ్రిజిరేటెడ్ గాజు పెట్టెలో ఉంచి తీసుకొచ్చారు. ఈ లడ్డూల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి 1 నెల పాటు తాజాగా ఉంటాయి.

Worlds largest lock: అయోధ్య చేరుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం, బాలరాముడికి భారీ లడ్డూ ప్రసాదం..
World's Largest Lock, laddoo
Follow us

|

Updated on: Jan 20, 2024 | 11:46 AM

Worlds largest lock: జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో పవిత్రోత్సవం జరగనుంది. ఇందుకోసం శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. జనవరి 22 పవిత్రమైన రోజును మరింత ప్రత్యేకంగా చేయడానికి, సాధారణ ప్రజలు దేశంలోని నలుమూలల నుండి ప్రత్యేక వస్తువులను పంపుతున్నారు. క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద తాళం, 1265 కిలోల భారీ లడ్డూ ప్రసాదం శనివారం అయోధ్య రామాలయానికి చేరుకుంది.

అయోధ్య రామయ్యకు భారీ లడ్డూ ప్రసాదం..

హైదరాబాద్‌కు చెందిన నాగభూషణ్‌రెడ్డి అనే వ్యక్తి రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డూను తయారు చేశారు. దాదాపు 30 మంది 24 గంటల పాటు నిరంతరం శ్రమించి ఈ లడ్డూను తయారు చేశారు. ఇక్కడ ఇంత పెద్ద లడ్డూ తయారు చేయడానికి ఏకంగా 4 గంటల సమయం పట్టింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో లడ్డూలను అయోధ్యకు తీసుకొచ్చారు. ఈ భారీ లడ్డూను జీడిపప్పు, బాదం, ఇతర పండ్లతో అలంకరించారు. పగిలిపోని విధంగా ఈ లడ్డూను తయారు చేశారు. ఈ లడ్డూ చెడిపోకుండా ఉండేందుకు హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఫ్రిజిరేటెడ్ గాజు పెట్టెలో ఉంచి తీసుకొచ్చారు. ఈ లడ్డూల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి 1 నెల పాటు తాజాగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోని అతిపెద్ద తాళం విశిష్టత ఏంటంటే..

అలీఘర్‌కు చెందిన తాళాలు తయారు చేసే వ్యక్తి సత్య ప్రకాష్ శర్మ, అతని భార్య రుక్మణి దేవి శర్మ స్వచ్ఛందంగా రామ మందిరానికి ఈ తాళాన్ని తయారు చేసి అందించారు. ఈ లాక్ మొత్తం బరువు 400 కిలోలు, దాని కీ బరువు 30 కిలోలు. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం అని పిలుస్తున్నారు. రూ.1.5 లక్షలతో సత్య ప్రకాష్‌ శర్మ దంపతులు ఈ తాళం తయారు చేశారు. కాగా, తాళం తయారీకి ఆరు నెలల సమయం పట్టిందని చెప్పారు.. ఈ తాళం పొడవు 10 అడుగులు, వెడల్పు 4.5 అడుగులు, మందం 9.5 అంగుళాలు ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..