Ayodhya Ram mandir: రామయ్య సేవకు విచ్చేసిన ఉడుత..! అయోధ్య అలంకారానికి హుబ్లీ కళాకారుల అద్భుత సృష్టి..

మరో మూడు రోజుల్లో అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు.. అయోధ్యకు కానుకలు పంపుతూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట సందర్భంగా అయోధ్య ధామ్ జంక్షన్‌లో హుబ్లీ కళాకారులచే ఒక ఉడుతను ఏర్పాటు చేశారు..అంటే, ఉడుత భారీ శిల్పం నిర్మించారు. ఆ శిల్పం స్థానికులతో పాటు రామ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది..

|

Updated on: Jan 20, 2024 | 1:21 PM

అయోధ్య రైల్వే స్టేషన్‌లో, ఆర్ట్‌వాల్లే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హుబ్లీ ద్వారా మొత్తం 5 కళాఖండాలు రూపొందించబడ్డాయి. ఆర్ట్ వాలీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ ఒస్తావాల్ మార్గదర్శకత్వంలో మొత్తం 20 మంది సిబ్బంది కేవలం 35 రోజుల్లో కళాకృతిని సిద్ధం చేశారు.

1 / 5
అయోధ్య ధామ్ జంక్షన్‌లో హుబ్లీ కళాకారులచే స్థాపించబడుతున్న ఈ ఉడుత పరిమాణంలో 19.5 అడుగుల పొడవు, జంక్షన్  ప్రధాన ద్వారం దగ్గర A-3 మార్గంలో క్వార్టన్ స్టీల్‌లో 2.5 టన్నుల బరువు ఉంటుంది.

2 / 5
అదే రైల్వే జంక్షన్‌లో 40 అడుగుల ఎత్తైన అయోధ్య రామమందిరం కళాఖండాలు, 8.5 అడుగుల అయోధ్య, 9 అడుగుల ఎత్తైన నామ ఫలకం, 40 అడుగుల ఎత్తైన సరయు నది ఘాట్ కళాఖండాలు ఏర్పాటు చేయబడ్డాయి.

3 / 5
కళ్యాణ్ జ్యువెలర్స్ ఆర్ట్ వర్క్స్ కోసం మెటీరియల్స్ కొనుగోలులో సహాయం చేసింది. ఆర్ట్ వర్క్ పూర్తి చేసుకున్న టీమ్ ఇప్పుడు హుబ్లీకి తిరిగి వచ్చింది. ఇలాంటి అవకాశం లభించినందుకు గర్వంగా భావిస్తున్నామని. నాలుగు నెలల్లో చేసిన పనిని కేవలం 35 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు.. శ్రీరాముడికి ఆ ఉడుత చేసిన సాయం లాంటిదే తమ సేవ అని భావిస్తున్నట్టుగా అర్టవాలే కళాకారులు చెప్పారు.

4 / 5
రామాయణంలో సీతజాడ తెలిసిన తర్వాత రాముడు లంకకు బయలు దేరుతాడు. సముద్రపై వానర సైన్యంతో సముద్రం మీద వారధి నిర్మించే బృహత్కార్యక్రమం మొదలు పెడతాడు శ్రీరాముడు. ఆ సమయంలో సముద్రపు ఒడ్డున నివసించే ఉడత రామకార్య సాధనలో తాను కూడా భాగం కావాలని ఆశపడింది. పిడికెడంత తాను నీటిలో తడుస్తూ, ఇసుకలో పొర్లాడుతూ ఆ ఇసుకను రాళ్లమధ్య నింపే ప్రయత్నం చేసింది. భక్తిగా ఉడుత చేస్తున్న సాయం చూసిన రాముడు ముచ్చట పడి తన చేతుల్లోకి తీసుకున్నాడు..

5 / 5
Follow us