CM Jagan: అబ్బురపరిచే ‘స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ విగ్రహావిష్కరణ చిత్రాలు..
విజయవాడలోని బందరు రోడ్డులో ఏర్పాటు చేసిన 205 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టూరిజం శాఖ మంత్రి రోజా, హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు.