- Telugu News Photo Gallery Does the face turn black? check with these products, check here is details
Skin Care: ముఖం నల్లగా మారుతుందా? ఈ రెండింటితో చెక్ పెట్టండిలా..
అందంగా ఉండాలని అనుకోని వారుండరు. అందంగా కనిపించాలంటే వయసుతో సంబంధం ఉండదు. ఏ వయసులో ఉన్నా అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా యంగ్ ఏజ్‌లో ఉన్నవారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందంగా ఉండేందుకు ఎన్నెన్నో ప్రాడెక్ట్స్‌ని వాడుతూ ఉంటారు. అయితే వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. చాలా మందిలో స్కిన్ పొడి బారిపోతూ ఉంటుంది. వింటర్ సీజన్ వచ్చిందంటే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. చర్మం పొడిబారిపోయి..
Updated on: Jan 20, 2024 | 1:13 PM

అందంగా ఉండాలని అనుకోని వారుండరు. అందంగా కనిపించాలంటే వయసుతో సంబంధం ఉండదు. ఏ వయసులో ఉన్నా అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా యంగ్ ఏజ్‌లో ఉన్నవారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందంగా ఉండేందుకు ఎన్నెన్నో ప్రాడెక్ట్స్‌ని వాడుతూ ఉంటారు. అయితే వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. చాలా మందిలో స్కిన్ పొడి బారిపోతూ ఉంటుంది.

వింటర్ సీజన్ వచ్చిందంటే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. చర్మం పొడిబారిపోయి.. నల్లగా, అంద విహీనంగా తయారువుతుంది. ఇలాంటి సమస్యల్ని తగ్గించుకోవడానికి బయట ప్రోడెక్ట్సే కాదు.. ఇంట్లోనే నేచురల్‌గా లభ్యమయ్యే వాటితో ముఖాన్ని నిగారించవచ్చు.

ముఖానికి పసుపును అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని చర్మ నిపుణులు సైతం చెబుతున్నారు. పసుపు, తేనె మంచి మంచి కాంబినేషన్. వీటిని మిక్స్ చేసి ముఖానికి పట్టించి.. సున్నితంగా మర్దనా చేస్తే.. చర్మం వెలిగిపోతుంది. అంతే కాకుండా ముఖం గ్లోగా తయారవుతుంది.

మొటిమల సమస్యతో ఇబ్బంది పడే వారికి కూడా తేనె చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ ముఖానికి పసుపు తేనెను అప్లై చేసి.. రెండు నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేయాలి. ఓ 15 నిమిషాల పాటు ఆరనిచ్చి.. చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖంపై మచ్చలు, మొటిమలు అనేవి క్రమంగా తగ్గుతాయి.

తరచుగా ఉపయోగించే బ్యూటీ ప్రాడెక్ట్స్ బదులు.. నేచురల్‌గా ఇంట్లో దొరికే వాటిని ముఖానికి రాసుకుంటే మంచి స్కిన్ మీ సొంతం అవుతుంది. అంతే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. అయితే కొన్ని రకాల పదార్థాలు కొంత మందికి పడవు. అది గమనించి ఉపయోగించాలి.





























