- Telugu News Photo Gallery Cinema photos Devi Sri Prasad Chart Busters On The Way For Allu Arjun Pushpa 2
Devi Sri Prasad: రచ్చకు బ్యాండ్ రెడీ చేసుకుంటున్న దేవీ శ్రీ ప్రసాద్
దేవీ శ్రీ ప్రసాద్ గతంలో మాదిరి ఎందుకు వరస సినిమాలు చేయడం లేదు..? అనిరుధ్, థమన్ ధాటికి ఆయన జోరు తగ్గించారా లేదంటే కొడితే కుంభస్థలమే అనేలా తన టైమ్ కోసం వేచి చూస్తున్నారా..? ప్రస్తుతం దేవీ ఎన్ని సినిమాలు చేస్తున్నారు..? మునపట్లా మళ్లీ నెంబర్ వన్ ప్లేస్‌కు వచ్చే ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయా..? అసలు DSP ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే.. తన పేరు కాకుండా మరో పేరు చెప్పలేని స్థాయిలో చాలా ఏళ్ళు పాటు తన మ్యూజికల్ మ్యాజిక్ చేసారు దేవీ శ్రీ ప్రసాద్.
Updated on: Jan 20, 2024 | 1:10 PM

దేవీ శ్రీ ప్రసాద్ గతంలో మాదిరి ఎందుకు వరస సినిమాలు చేయడం లేదు..? అనిరుధ్, థమన్ ధాటికి ఆయన జోరు తగ్గించారా లేదంటే కొడితే కుంభస్థలమే అనేలా తన టైమ్ కోసం వేచి చూస్తున్నారా..? ప్రస్తుతం దేవీ ఎన్ని సినిమాలు చేస్తున్నారు..? మునపట్లా మళ్లీ నెంబర్ వన్ ప్లేస్‌కు వచ్చే ప్రాజెక్ట్స్ ఆయన చేతిలో ఉన్నాయా..? అసలు DSP ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..?

తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే.. తన పేరు కాకుండా మరో పేరు చెప్పలేని స్థాయిలో చాలా ఏళ్ళు పాటు తన మ్యూజికల్ మ్యాజిక్ చేసారు దేవీ శ్రీ ప్రసాద్.

కానీ కొన్నేళ్లుగా దేవీ పేరు పెద్దగా కనిపించడం లేదు.. ఆయన పాటలు కనిపించట్లేదు. 2023లో కేవలం వాల్తేరు వీరయ్యకు మాత్రమే సంగీతం అందించారు దేవీ.

ఇదే సమయంలో థమన్, అనిరుధ్ లాంటి వాళ్లు వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే 2024 మాత్రం అలా ఉండదంటున్నారు దేవీ. గ్యాప్ తీసుకున్నా కూడా.. ఈ ఇయర్ మాత్రం గ్రాండ్‌గానే ప్లాన్ చేస్తున్నారు DSP. ఓ వైపు అల్లు అర్జున్ పుష్ప 2.. మరోవైపు చందూ మొండేటి తండేల్.. ఇంకోవైపు ధనుష్, శేఖర్ కమ్ముల లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంగీతం అందిస్తున్నారు.

పుష్ప 2, తండేల్, DNS అన్నీ పాన్ ఇండియన్ సినిమాలే. వీటిపై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మామూలుగా లేవు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సైతం దేవీ చేతిలోనే ఉంది. ఇదెప్పుడు మొదలవుతుందో తెలీదు కానీ.. ఎప్పుడు మొదలైనా మోత మోగించడం మాత్రం ఖాయం. వీటితోనే తన ప్లేస్ మళ్లీ వెనక్కి తెచ్చుకుంటున్నారంటున్నారు దేవీ. చూడాలిక.. ఏం జరగబోతుందో..?




