AP Government: విధుల్లో చేరని అంగన్‌వాడీలను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
సుదీర్ఘకాలం అంగన్‌వాడీలు ఉద్యమం చేస్తూ వస్తున్నారు. వివిధ రకాలుగా ఆందోళలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం విధుల్లో చేరని అంగన్‌వాడీలను వెంటనే తొలగించాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విధుల్లోకి చేరని అంన్‌వాడీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉదయం 9.30 గంటలలోపు విధుల్లో చేరని అంగన్‌వాడీలను తొలగించాలంటూ..
ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీలకు షాకిచ్చింది. విధులకు హాజరు కాని అంగన్‌వాడీ కార్యకర్తలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధులకు హాజరు కానీ అంగన్‌వాడీలపై సర్కార్ ఈ చర్యలకు దిగింది. ఉదయం 9.30 గంటలలోపు విధుల్లో చేరని అంగన్‌వాడీలను తొలగించాలంటూ ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం విధులకు హాజరు కానీ 15 వేల మంది అంగన్‌వాడీలను తొలగించింది. ఈనెల 25న కొత్త నోటిఫికేషన్‌ను ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కృష్ణాజిల్లాలో 2,828 మంది అంగన్‌వాడీలను తొలగించింది ప్రభుత్వం.
ఇదిలా ఉండగా, సుదీర్ఘకాలం అంగన్‌వాడీలు ఉద్యమం చేస్తూ వస్తున్నారు. వివిధ రకాలుగా ఆందోళలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం విధుల్లో చేరని అంగన్‌వాడీలను వెంటనే తొలగించాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విధుల్లోకి చేరని అంన్‌వాడీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.