Visakhapatnam: సముద్ర గర్భంలో ‘జై శ్రీరామ్’… వినూత్నంగా భక్తి చాటుకున్న క్యూబా డ్రైవర్స్
విశాఖ లివ్ ఇన్ అడ్వంచర్స్ సంస్థ వ్యవస్థాపకుడు, ఇండియన్ నావీ ఎక్స్ సబ్ మెరైనర్ బలరామ్ నాయుడు ప్రత్యేకంగా ఈ అరుదైన కార్యక్రమం చేపట్టారు. విశాఖ రుషికొండ లో స్కూబా డైవర్లు సమాజహిత కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఇటీవలే జీవీఎంసీకి సంబంధించిన అనేక కార్యక్రమాలలో...

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కన్నుల పండగైతే… విశాఖ రుషికొండ సాగరంలో మరో అరుదైన దృశ్యం కనువిందు చేస్తోంది. సముద్రంలో శ్రీ రాముడు చిత్ర పటాన్ని కొలువుదీర్చి, నీటి బుడగలే అక్షింతలుగా, సాగరంలో పూల అభిషేకాలతో రామ భక్తిని చాటుకున్నారు విశాఖ స్కూబా డైవర్స్.
విశాఖ లివ్ ఇన్ అడ్వంచర్స్ సంస్థ వ్యవస్థాపకుడు, ఇండియన్ నావీ ఎక్స్ సబ్ మెరైనర్ బలరామ్ నాయుడు ప్రత్యేకంగా ఈ అరుదైన కార్యక్రమం చేపట్టారు. విశాఖ రుషికొండ లో స్కూబా డైవర్లు సమాజహిత కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఇటీవలే జీవీఎంసీకి సంబంధించిన అనేక కార్యక్రమాలలో సహాయపడ్డారు. ఆ క్రమంలోనే ఇప్పుడు విశాఖ రుషికొండలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట చేశారు. ఇది కూడా సముద్ర గర్భంలో ప్రాణ ప్రతిష్ట. ప్రత్యేకంగా తయారు చేసిన శ్రీరాముడి డిజైన్ బోర్డును దీనికి కేటాయించారు. ఇది ఇరవై రెండు అడుగుల లోతులో ప్రతిష్ట చేశారు.
ఇందుకోసం ఉదయం ఆరుగంటలకు బయలుదేరిన డైవర్లు స్కూబా కిట్స్‌తో పాటు వెళ్లారు. రుషికొండ తీరం నుంచీ సుమారు నాలుగు నాటికల్ మైళ్ల దూరంలో సముద్రం లోతులో దిగారు. అక్కడే శ్రీరాముడు చిత్రపటాన్ని కూడా ఇలా సముద్రంలో నిలిపారు. రామయ్య చిత్రం సముద్రంలోనే ఉంటుందని స్కూబా డ్రైవర్ బలరామ్ నాయుడు తెలిపాడు. ప్రత్యేకంగా సముద్రంలో ఇది ఉండిపోయే విధంగా లోపలే ప్రతిష్ట నిర్వహించారు.
దీనికి ప్రత్యేక కెమెరాలు వాడి నీటిలో షూట్ చేశారు. మొత్తం నలుగురు స్కూబా డైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మొత్తం కార్యక్రమానికి దాదాపు నాలుగంటల సమయం పట్టిందని బలరామ్ నాయుడు టీవీ9 కి వివరించారు. అయోధ్యలో రాముడ్ని ప్రతిష్టంచడం ఎంతో శుభపరిణామమని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
