‘ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేరు’.. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫైర్..

ఏపీ రాజకీయాలు మరింత వేడేక్కాయి. వైసీపీ, టీడీపీ టార్గెట్‌గా షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అటు షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. షర్మిల కాదు.. ఎవరొచ్చినా జగన్‌ను ఏమి చేయలేరంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు.

'ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేరు'.. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫైర్..
YS Sharmila
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 22, 2024 | 9:00 AM

ఏపీ రాజకీయాలు మరింత వేడేక్కాయి. వైసీపీ, టీడీపీ టార్గెట్‌గా షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అటు షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. షర్మిల కాదు.. ఎవరొచ్చినా జగన్‌ను ఏమి చేయలేరంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు.

పీసీసీగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల.. వైసీపీ, టీడీపీతో పాటు బీజేపీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ రాజకీయాల్లో తన వైఖరి ఏంటనేది చెప్పకనే చెప్పేశారామె. గడిచిన పదేళ్లలో ఏపీని అప్పుల కుప్పగా మార్చారని షర్మిల మండిపడ్డారు. పది లక్షల కోట్ల అప్పులో ఏపీ కూరుకుపోయింది. పోనీ అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే.. భూతద్దం పెట్టి చూసినా కనపడటం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు పెరిగిపోయాయి. దోచుకోవడం, దాచుకోవడమే అన్నట్టుగా పాలన సాగుతోందన్నారామె. అమరావతి పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపిస్తే.. ఆ తర్వాత వచ్చిన జగన్.. మూడు రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా కట్టలేదు.. చివరకు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారంటూ విమర్శించారు షర్మిల. పోలవరాన్ని సైతం నిర్లక్ష్యం చేశారంటూ విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ, వైసీపీనే కారణమంటూ మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. బీజేపీకి అమ్ముడుపోయి ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాటం కూడా చేయలేదన్నారు.

APCC చీఫ్‌ షర్మిల విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రతిసారి ప్రస్తావిస్తున్నామన్నారు. ఎప్పటికైనా హోదా వస్తుందని చెప్పారు. చంద్రబాబును సీఎం చేయడమే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారని విమర్శించారు సజ్జల. షర్మిల వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత అయిన వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఏ పార్టీలోకి వెళ్లి ఎవరి గురించి మాట్లాడుతున్నారో షర్మిలకు అర్థమవుతుందా అంటూ నిలదీశారాయన. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. షర్మిల వ్యాఖ్యలను తప్పుబట్టారు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. వైసీపీ ఓటు బ్యాంక్ చీల్చి.. ఎవరి లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించాలని కోరారు అనిల్. మొత్తంగా షర్మిల విమర్శలతో ఏపీ రాజకీయాలు మరింత వేడేక్కాయి. అధికారపార్టీని షర్మిల టార్గెట్‌ చేయడంతో ఏపీ రాజకీయాల్లో మరింత దుమారం రేగింది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!