TTD: 24 అంశాలతో టీటీడీ ధర్మకర్తల మండలి కీలక సమావేశం.. భక్తులు, సిబ్బంది సంక్షేమానికి పెద్ద పీట

తిరుమల టీటీడీ ధ‌ర్మక‌ర్తల మండ‌లి సమావేశం అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేసింది. తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్యక్షత‌న జరిగిన సమావేశంలో ధ‌ర్మక‌ర్తల మండ‌లి స‌మావేశం ప్రధానంగా 24 అంశాలపై చర్చించింది. ఇందులో తిరుప‌తిలోని అలిపిరి స‌ప్తగోప్రద‌క్షిణ మందిరంలో శ్రీ‌నివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాల‌ని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న హిందూ..

TTD: 24 అంశాలతో టీటీడీ ధర్మకర్తల మండలి కీలక సమావేశం.. భక్తులు, సిబ్బంది సంక్షేమానికి పెద్ద పీట
TTD Board of Trustees
Follow us
Raju M P R

| Edited By: Srilakshmi C

Updated on: Oct 09, 2023 | 8:45 PM

తిరుపతి, అక్టోబర్‌ 9: తిరుమల టీటీడీ ధ‌ర్మక‌ర్తల మండ‌లి సమావేశం అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేసింది. తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్యక్షత‌న జరిగిన సమావేశంలో ధ‌ర్మక‌ర్తల మండ‌లి స‌మావేశం ప్రధానంగా 24 అంశాలపై చర్చించింది. ఇందులో తిరుప‌తిలోని అలిపిరి స‌ప్తగోప్రద‌క్షిణ మందిరంలో శ్రీ‌నివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాల‌ని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న హిందూ భ‌క్తులు త‌మ శుభ‌కార్యాలు, విశేష‌మైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంక‌ల్పం చెప్పుకుని య‌జ్ఞం నిర్వహించుకునేలాయ‌జ్ఞం నిర్వహ‌ణ‌కు అవకాశం కల్పించ నుంది. పారిశుద్ధ్య కార్మికులకు ప్రస్తుతం ఉన్న రూ.12 వేల వేతనాన్ని రూ.17 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకుంది.

దీంతో 5వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఇక రద్దీ సమయాల్లో తిరుమ‌ల‌లో వేలాది మంది సామాన్య భక్తులు గోగర్భం డ్యామ్‌ సర్కిల్‌ నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైన సరైన వసతులు లేని తాత్కాలిక క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. వీరి సౌకర్యార్థం రూ.18 కోట్లతో శాశ్వత క్యూలైన్లు, ఫుడ్‌ కౌంటర్లు, టాయ్‌లెట్లు నిర్మించాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది. అలాగే నారాయణగిరి విశ్రాంతి గృహం సర్కిల్‌, ఆళ్వార్‌ ట్యాంకు రోడ్డు సర్కిల్‌ వద్ద రెండు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపింది.

మరోవైపు తిరుమల మొదటి ఘాట్‌ రోడ్‌లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి మోకాలిమెట్టు వరకు రోడ్డు పక్కన నడిచే భక్తులు ఎండకు, వర్షానికి ఇబ్బందులకు గురికాకుండా రూ.2.81 కోట్లతో నడకదారి షెల్టర్లు నిర్మాణానికి టెండర్లకు కూడా ఆమోదం చెప్పిన బోర్డు యాత్రికులకు నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకు అందించాలన్న ఉద్దేశంతో తిరుమలలో ఎపీ టూరిజం సంస్థకు అన్నమయ్య భవనం, నారాయణగిరి క్యాంటీన్లను అప్పగించింది. భక్తులకు భోజనం తక్కువ ధరకే ఇవ్వాలని ఇందులోభాగంగా రూ.2.93 కోట్లతో నారాయణగిరి క్యాంటీన్‌లో మూడో అంతస్తు నిర్మాణం అభివృద్ధి పనులు చేయడానికి టెండరుకు ఆమోదం తెలిపింది. ఇక తిరుమలలో 63 ఏళ్ల క్రితం నిర్మించిన గాయత్రీ సదన్‌, శ్రీవారి కుటీర్‌, టీబీసీ-53, టీబీసీ-64 తదితర 13 విశ్రాంతి గృహాలను కాటేజి డొనేషన్‌ స్కీమ్‌ కింద పునర్నిర్మాణం చేసి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఆమోదం తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇక తిరుప‌తిలో ప్రధాన రోడ్ల మరమ్మతులు, నిర్వహణ బాధ్యత టిటిడి తీసుకుంది. టీటీడీకి చెందిన ఆల‌యాల‌తోపాటు టీటీడీకి సంస్థ‌లు, వ‌స‌తి స‌ముదాయాలు ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుప‌ర‌చాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించి పారిశుద్ధ్య నిర్వహ‌ణ బాధ్యత‌ను టీటీడీ చేప‌ట్టాల‌ని నిర్ణయించింది. టీటీడీ తన సామాజిక బాధ్యతగా వేలాది మంది భక్తులు వచ్చే తిరుపతి అభివృద్ధి పరచాల్సిన బాధ్యతను గుర్తించి ప్రతి సంవత్సరం టీటీడీ బడ్జెట్‌లో ఒక శాతం తిరుపతి అభివృద్ధికి ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.

ఇక తిరుమలలోని జాపాలి తీర్థం, శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాలకు వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ అధికంగా ఉండటం, హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగు టుండటంతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆకాశగంగ నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రూ.40 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గోగర్భం డ్యామ్‌ భద్రత దృష్ట్యా రోడ్డు నిర్మాణం డ్యామ్‌కు దిగువన వచ్చేలా డిజైన్స్ రూపొందించింది.

తిరుమ‌ల‌లో వరాహస్వామి విశ్రాంతి గృహం వద్ద ట్రాఫిక్‌ దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాల రద్దీని పూర్తిగా మళ్లించేందుకు రూ.10.80 కోట్లతో వరాహస్వామి విశ్రాంతి గృహం నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు, ఫుట్‌పాత్‌, డ్రెయిన్లు, వీధి దీపాలు, సైన్‌బోర్డులు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ ప్రాంతంలోని యాత్రికులకు ట్రాఫిక్ స‌మ‌స్య తీరుతుంది.

మరోవైపు ఏళ్ల క్రితం నిర్మించిన టీటీడీలోని అన్ని ఆలయాలు, గోపురాల పటిష్టతను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఐఐటి డిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా మరమ్మతులు చేసి మరలా భావితరాల వారికి ఆలయాలు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. గతంలో చెర్లోపల్లి నుండి శ్రీనివాసమంగాపురం, శ్రీవారిమెట్టు మార్గాలలో తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం 2010లో నిర్మించిన రోడ్డు ఇప్పుడు రద్దీ గా మారిపోయింది. దీంతో చెర్లోపల్లి నుండి శ్రీనివాసమంగాపురం రోడ్డులో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో, ట్రాఫిక్‌కు అనుగుణంగా నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించి బిటి రోడ్డు, వీధిదీపాలు, డ్రెయిన్లు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు రూ.25 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరుకు టిటిడి బోర్డు ఆమోదం తెలిపింది.

టీటీడీ పాఠశాలల్లో చదువుతున్న 3,259 మంది విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాలని కూడా టిటిడి బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 విద్యా సంవత్సరం నుండి టీటీడీ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. గతంలో ఇస్కాన్‌ సంస్థ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేసి సమీపంలోని టీటీడీ కళాశాలల హాస్టళ్ల నుండి పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది. అన్నం, సాంబారు, కూర, రసం, చట్నీ, పెరుగు లేదా మజ్జిగను మెనుగా దిట్టాన్ని నిర్ణయించింది. ఇందుకుగాను సంవత్సరానికి రూ.2.63 కోట్లకు పైగా వ్యయం చేయడానికి ఆమోదం తెలిపింది.

టీటీడీ క‌ల్యాణ మండ‌పాల్లో వివాహాలు జ‌రిపే స‌మ‌యంలో డీజే పాటలు కాకుండా భ‌క్తిగీతాల‌తో మాత్రమే సంగీత విభావ‌రి నిర్వహించుకోవాల‌ని నిబంధ‌న విధించ‌డం జ‌రిగింది. దూరప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల బస్సులు, ఇతర వాహనాలను అలిపిరిలో పార్క్‌ చేసి తిరుమలకు వెళ్ళే వారి కోసం అలిపిరిలో పార్కింగ్ వసతి సౌకర్యాలు ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 130 వాహనాలను పార్క్‌ చేసేందుకు 2.47 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 156 బస్సులు, 683 కార్లు/జీపులు, 1325 ద్విచక్రవాహనాలు పార్కింగ్‌ చేసుకునే విధంగా, 7 అదనపు టాయ్‌లెట్లు, యాత్రికులు వంట చేసుకునేందుకు అనువుగా మూడు షెడ్లు నిర్మాణానికి మరో 11.34 ఎకరాలు అభివృద్ధి చేసి, ఇక్కడ బిటి రోడ్లు, భూదేవి కాంప్లెక్సు వద్ద దర్శనటోకెన్లు పొందే భక్తులకు క్యూలైన్లు, లైటింగ్‌ తదితర వసతులు కల్పించేందుకు రూ.21.60 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపింది.

ఇక అన్నమాచార్య సంకీర్తన‌ల‌కు విశేష ప్రాచుర్యం క‌ల్పించిన టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గ‌రిమెళ్ల బాల‌కృష్ణప్రసాద్‌కు ప‌ద్మశ్రీ అవార్డు ప్రక‌టించాల‌ని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాద‌న‌లు పంపాల‌ని టిటిడి పాలక మండలి నిర్ణ‌యం తీసుకున్నట్లు ఈ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వివరించారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు