APSRTC: దసరా ప్రయాణీకులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

APSRTC: దసరా ప్రయాణీకులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

Phani CH

|

Updated on: Oct 09, 2023 | 8:31 PM

దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్నాటకలోని స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 5,500 ప్రత్యేక సర్వీసులు సిద్ధంచేస్తున్నారు. అక్టోబరు 13 నుండి 26 వరకు.. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపనుంది ఏపీఎస్‌ ఆర్టీసీ. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు 2,700 బస్సులు, 23 నుంచి 26వ తేదీ వరకు 2,800 బస్సులు నడపనున్నారు.

దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్నాటకలోని స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 5,500 ప్రత్యేక సర్వీసులు సిద్ధంచేస్తున్నారు. అక్టోబరు 13 నుండి 26 వరకు.. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపనుంది ఏపీఎస్‌ ఆర్టీసీ. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు 2,700 బస్సులు, 23 నుంచి 26వ తేదీ వరకు 2,800 బస్సులు నడపనున్నారు. దసరాకు ముందు హైదరాబాద్ నుంచి 2,050, బెంగళూరు నుంచి 440, చెన్నై నుంచి 153 బస్సులు ఏపీలోని వివిధ నగరాలు, పట్టణాలకు నడవనున్నాయి. రాష్ట్ర పరిధిలో విజయవాడ నుంచి 885 బస్సులు, విశాఖ నుంచి 480, రాజమహేంద్రవరం నుంచి 355 కలిపి మొత్తం 1,137 ప్రత్యేక బస్సులను వివిధ జిల్లాలకు నడుపుతారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెడికల్‌ షాపులో పనిచేసే కుర్రాడి ఎకౌంట్‌లో రూ.756 కోట్లు.. ఎలా ??

కల్తీ ఆయిల్‌ తయారు చేసి టిఫిన్‌ సెంటర్లు, బేకరీలకు సరఫరా

మ్యూజిక్‌ ఫెస్ట్‌పై విరుచుకుపడిన మిలిటెంట్లు.. కార్లలో దాక్కున్నా వదల్లేదు..

విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాలతో రికార్డింగ్

సినీ ఫక్కీలో పోలీసులనుంచి తప్పించుకున్నాడు.. వీడియో చూస్తే