మ్యూజిక్ ఫెస్ట్‌పై విరుచుకుపడిన మిలిటెంట్లు.. కార్లలో దాక్కున్నా వదల్లేదు..
ఇజ్రాయెల్ పై అక్టోబరు 7న రాకెట్లతో విరుచుకు పడ్డ హమాస్ మిలిటెంట్లు.. బార్డర్ లో జరుగుతున్న ఓ మ్యూజికల్ పార్టీపైనా తూటాల వర్షం కురిపించారు. పారాచూట్లతో బార్డర్ దాటి పార్టీ జరుగుతున్న చోట ల్యాండయ్యారు. గాలిలో ఉండగానే కాల్పులు మొదలుపెట్టారు. నేలపై దిగాక విచక్షణారహితంగా బుల్లెట్లతో విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లు తమ తుపాకులకు బలిచ్చారు. చుట్టూ అంతా ఖాళీ ప్రదేశం కావడంతో తలదాచుకునేందుకు చోటులేక ఇజ్రాయెల్ పౌరులు నిస్సహాయంగా మృత్యువాత పడ్డారు.
ఇజ్రాయెల్ పై అక్టోబరు 7న రాకెట్లతో విరుచుకు పడ్డ హమాస్ మిలిటెంట్లు.. బార్డర్ లో జరుగుతున్న ఓ మ్యూజికల్ పార్టీపైనా తూటాల వర్షం కురిపించారు. పారాచూట్లతో బార్డర్ దాటి పార్టీ జరుగుతున్న చోట ల్యాండయ్యారు. గాలిలో ఉండగానే కాల్పులు మొదలుపెట్టారు. నేలపై దిగాక విచక్షణారహితంగా బుల్లెట్లతో విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లు తమ తుపాకులకు బలిచ్చారు. చుట్టూ అంతా ఖాళీ ప్రదేశం కావడంతో తలదాచుకునేందుకు చోటులేక ఇజ్రాయెల్ పౌరులు నిస్సహాయంగా మృత్యువాత పడ్డారు. కొంతమంది పరుగెత్తుకెళ్లి కార్లలో దాక్కున్నా మిలిటెంట్లు విడిచిపెట్టలేదు. కార్లన్నీ వెతుకుతూ మరీ కాల్పులు జరిపారు. సుక్కోట్ సెలవుల సందర్భంగా గాజా బార్డర్ లోని పొలాల్లో ఆల్ నైట్ మ్యూజికల్ పార్టీ ఏర్పాటు చేశారు. సెలవుల నేపథ్యంలో ఈ పార్టీకి పెద్ద సంఖ్యలో పౌరులు హాజరయ్యారు. పార్టీలో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ, చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో సడెన్ గా ఆకాశం నుంచి హమాస్ మిలిటెంట్లు పారాచూట్లతో ఎగురుకుంటూ వచ్చి దారుణానికి ఒడిగట్టారు. మిలిటెంట్లు కాల్పులతో అక్కడ అంతా గందరగోళం నెలకొంది. వారి నుంచి తప్పించుకోవడానికి జనం పరుగులు పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విద్యార్థినుల వాష్‌రూంలో రహస్య కెమెరాలతో రికార్డింగ్
సినీ ఫక్కీలో పోలీసులనుంచి తప్పించుకున్నాడు.. వీడియో చూస్తే
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు అరుదైన గౌరవం
గుడ్ న్యూస్.. చీరమేను చేప వచ్చిందోచ్.. కేజీ ఎంతంటే ??
ముఖ్యమంత్రి సారూ.. మాకు రూ.2 వేలు రాలేదు అంటూ నిలదీసిన మహిళలు