సినీ ఫక్కీలో పోలీసులనుంచి తప్పించుకున్నాడు.. వీడియో చూస్తే
ముంబైలో ఓ ఆఫ్రికా జాతీయుడు పోలీసులకు ఊహించని షాకిచ్చాడు. ఓ డ్రగ్స్ కేసులో అతడిని అరెస్టు చేసి బయటకు తీసుకొస్తుండగా అకస్మాత్తుగా వారి నుంచి తప్పించుకున్నాడు. అతడిని వెంబడించే క్రమంలో ఓ పోలీసు కిందపడిపోయాడు. మిగతా పోలీసులు నిందితుడి వెంట పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. డ్రగ్స్ నివారణే లక్ష్యంగా ఇటీవల ముంబై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
ముంబైలో ఓ ఆఫ్రికా జాతీయుడు పోలీసులకు ఊహించని షాకిచ్చాడు. ఓ డ్రగ్స్ కేసులో అతడిని అరెస్టు చేసి బయటకు తీసుకొస్తుండగా అకస్మాత్తుగా వారి నుంచి తప్పించుకున్నాడు. అతడిని వెంబడించే క్రమంలో ఓ పోలీసు కిందపడిపోయాడు. మిగతా పోలీసులు నిందితుడి వెంట పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. డ్రగ్స్ నివారణే లక్ష్యంగా ఇటీవల ముంబై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు అక్టోబరు 6న నగరంలోని ఉల్వేనోడ్ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో నైజీరియాకు చెందిన జూలియస్ ఓ ఆంథొనీ అనే నైజీరియా దేశస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 70 లక్షలు పైగా విలువైన మెఫెడ్రోన్, దాదాపు 15 లక్షల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో మొత్తం 14 మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కొందరిని అరెస్టు చేసి తరలిస్తుండగా వారిలో ఓ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో, అక్కడున్న పోలీసులు అతడిని వెంబడించారు. అయితే, పారిపోయిన నిందితుడు పోలీసులకు చిక్కాడా? లేదా? అనేది తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట చేరి వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు అరుదైన గౌరవం
గుడ్ న్యూస్.. చీరమేను చేప వచ్చిందోచ్.. కేజీ ఎంతంటే ??
ముఖ్యమంత్రి సారూ.. మాకు రూ.2 వేలు రాలేదు అంటూ నిలదీసిన మహిళలు
20 నిమిషాల్లో 5వేల రాకెట్ల వెనుక అసలు కథ ఇది
దేశం కాని దేశంలో ఏం జరిగిందో తెలీదు !! ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు