20 నిమిషాల్లో 5వేల రాకెట్ల వెనుక అసలు కథ ఇది

20 నిమిషాల్లో 5వేల రాకెట్ల వెనుక అసలు కథ ఇది

Phani CH

|

Updated on: Oct 09, 2023 | 8:10 PM

ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వివాదాస్పద గాజా స్ట్రిప్‌ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు శనివారం ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోని ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది.

ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వివాదాస్పద గాజా స్ట్రిప్‌ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు శనివారం ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోని ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించామని హమాస్‌ మిలిటరీ వింగ్‌ హెడ్‌ మొహమ్మద్‌ డెయిఫ్‌ ప్రకటించాడు. దీంతో ఇజ్రాయెల్‌ సైన్యం అప్రమత్తమైంది. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ స్థావరాలపై ప్రతిదాడులు చేపట్టినట్లు వెల్లడించింది. మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లను కూల్చేందుకు యాంటీ రాకెట్‌ డిఫెన్స్‌ వ్యవస్థను యాక్టివేట్‌ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశం కాని దేశంలో ఏం జరిగిందో తెలీదు !! ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు

లాకప్‌లో ఉంచినందుకు రూ.50 వేల పరిహారం.. పోలీసులే చెల్లించాలని ఢిల్లీ కోర్టు ఆదేశం

న్యూ లుక్‌తో మెరిసిపోతున్న ఎయిర్‌ ఇండియా విమానాలు