లాకప్‌లో ఉంచినందుకు రూ.50 వేల పరిహారం.. పోలీసులే చెల్లించాలని ఢిల్లీ కోర్టు ఆదేశం

లాకప్‌లో ఉంచినందుకు రూ.50 వేల పరిహారం.. పోలీసులే చెల్లించాలని ఢిల్లీ కోర్టు ఆదేశం

Phani CH

|

Updated on: Oct 09, 2023 | 8:07 PM

పోలీసులు ఓ వ్యక్తిని అక్రమంగా అరగంట పాటు లాకప్‌లో నిర్బంధించడంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధితుడికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు పోలీసు అధికారుల నుంచే ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ కూరగాయల వ్యాపారికి, మహిళకు మధ్య గతేడాది సెప్టెంబరులో గొడవ జరిగింది. దీనిపై ఫిర్యాదు అందడంతో ఆ వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి అరగంట పాటు లాకప్‌లో బంధించిన తర్వాత విడిచిపెట్టారు.

పోలీసులు ఓ వ్యక్తిని అక్రమంగా అరగంట పాటు లాకప్‌లో నిర్బంధించడంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధితుడికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు పోలీసు అధికారుల నుంచే ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ కూరగాయల వ్యాపారికి, మహిళకు మధ్య గతేడాది సెప్టెంబరులో గొడవ జరిగింది. దీనిపై ఫిర్యాదు అందడంతో ఆ వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి అరగంట పాటు లాకప్‌లో బంధించిన తర్వాత విడిచిపెట్టారు. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించినందుకు పరిహారం కోరుతూ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఎఫ్‌ఐఆర్‌ లేకుండా బాధితుడిని అదుపులోకి తీసుకోవడం ఆందోళనకరం అని జడ్జి అభిప్రాయపడ్డారు. అరెస్టు చేయకుండానే అకారణంగా లాకప్‌లో కూర్చోబెట్టారని పిటిషనర్‌ స్వేచ్ఛను హరించిన పోలీసులను తీరును సమర్థించలేమని అన్నారు. బాధితుడికి రూ.50 వేల పరిహారం అందించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

న్యూ లుక్‌తో మెరిసిపోతున్న ఎయిర్‌ ఇండియా విమానాలు