దేశం కాని దేశంలో ఏం జరిగిందో తెలీదు !! ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు
అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబం అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివసించే తేజ్ ప్రతాప్ సింగ్ ఆయన భార్య సోనాల్ పరిహర్ వారి పదేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె వారి ఇంట్లోనే విగతజీవులుగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. తేజ్ ప్రతాప్ కుటుంబం ఎలా ఉందో కనుక్కోమంటూ అతడి బంధువుల్లో ఒకరు పోలీసులను కోరారు. దీంతో వారు తేజ్‌ప్రతాప్ ఇంటికి చేరుకోగా.. ఈ దారుణం వెలుగుచూసింది.
అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబం అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో నివసించే తేజ్ ప్రతాప్ సింగ్ ఆయన భార్య సోనాల్ పరిహర్ వారి పదేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె వారి ఇంట్లోనే విగతజీవులుగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. తేజ్ ప్రతాప్ కుటుంబం ఎలా ఉందో కనుక్కోమంటూ అతడి బంధువుల్లో ఒకరు పోలీసులను కోరారు. దీంతో వారు తేజ్‌ప్రతాప్ ఇంటికి చేరుకోగా.. ఈ దారుణం వెలుగుచూసింది. ప్రతాప్ సింగ్ ముందు కుటుంబసభ్యుల్ని చంపి ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంతోపాటు, హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. తేజ్ ప్రతాప్ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేదని, వారంతా కమ్యూనిటీలోని అందరితో స్నేహపూర్వకంగానే మెలిగేవారని స్థానికులు చెబుతున్నారు. ఇంత ఘోరం జరుగుతుందని తాము ఊహించలేదన్నారు. తేజ్ ప్రతాప్ ఓ ఐటీ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తుండగా.. ఆయన భార్య కూడా మరో ఐటీ కంపెనీలో హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లాకప్‌లో ఉంచినందుకు రూ.50 వేల పరిహారం.. పోలీసులే చెల్లించాలని ఢిల్లీ కోర్టు ఆదేశం
న్యూ లుక్‌తో మెరిసిపోతున్న ఎయిర్ ఇండియా విమానాలు