Plane Crash: కూలిన విమానం.. ఇద్దరు భారతీయ పైలట్లు మృతి.. ఇండియన్స్ ఇద్దరు.

Plane Crash: కూలిన విమానం.. ఇద్దరు భారతీయ పైలట్లు మృతి.. ఇండియన్స్ ఇద్దరు.

Anil kumar poka

|

Updated on: Oct 09, 2023 | 3:03 PM

కెనడాలో ఓ శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందినవారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని చిల్లివాక్ సిటీ విమానాశ్రయానికి సమీపంలో ఈ శిక్షణ విమానం కూలింది. ఇందులో ఇద్దరు భారతీయ ట్రెయినీ పైలట్లు ఉన్నారు. శిక్షణలో ఉన్న హైపర్ పీఏ-4 సెనెకా లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్ హఠాత్తుగా పొదల్లోకి దూసుకెళ్లింది.

కెనడాలో ఓ శిక్షణ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందినవారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని చిల్లివాక్ సిటీ విమానాశ్రయానికి సమీపంలో ఈ శిక్షణ విమానం కూలింది. ఇందులో ఇద్దరు భారతీయ ట్రెయినీ పైలట్లు ఉన్నారు. శిక్షణలో ఉన్న హైపర్ పీఏ-4 సెనెకా లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్ హఠాత్తుగా పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముంబైకి చెందిన అభయ్ గద్రూ, యశ్ విజయ్‌తో పాటు రాముగడె అనే మరో పైలట్‌ కూడా మృతి చెందారు. భారతీయ పైలట్లు ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో ఈ ముగ్గురు పైలట్లకు మినహా ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి 5 అంబులెన్స్ లు చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విమాన ప్రమాదంపై కెనడా ట్రాన్సుపోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణ చేపట్టింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..