Gambling: అడవిలో దుకాణం పెట్టారు.. అయినా దొరికిపోయారు. గ్యాంబ్లింగ్ ముఠాపై పోలీసులు.
నగరాలు, పట్టణాలు, మారుమూల గ్రామాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అడవుల బాట పట్టారు. అయినా దొరికిపోయారు. నంద్యాల జిల్లాలో పేకాటరాయుళ్ల ఆట కట్టించారు పోలీసులు. జనారణ్యం వదిలి అభయారణ్యంలో పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.నంద్యాల జిల్లా మహానంది ఆలయానికి కూత వేటు దూరంలో నల్లమల అభయారణ్యంలో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం
నగరాలు, పట్టణాలు, మారుమూల గ్రామాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అడవుల బాట పట్టారు. అయినా దొరికిపోయారు. నంద్యాల జిల్లాలో పేకాటరాయుళ్ల ఆట కట్టించారు పోలీసులు. జనారణ్యం వదిలి అభయారణ్యంలో పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. నంద్యాల జిల్లా మహానంది ఆలయానికి కూత వేటు దూరంలో నల్లమల అభయారణ్యంలో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. స్థానికులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలనుంచి కూడా తరలి వచ్చారు గ్యాంబ్లింగ్ ముఠా. పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు నంద్యాల పోలీసులు. పథకం ప్రకారం మారువేషంలో గ్యాంబ్లింగ్ డెన్‌కు చేరుకున్నారు. వాహనాలన్నీ మహానందిలో వదిలి నల్లమల అడవుల్లోకి నడుచుకుంటూ వెళ్లి గ్యాంబ్లిలింగ్ ఆడుతున్నవారిని గుర్తించారు. 13 మందిని అదుపులోకి తీసుకున్నారు మరికొందరు అడవిలోకి పారిపోయారు. పేకాటరాయుళ్ల నుంచి 6 లక్షల నగదు, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండతోనే ఆటగాళ్లు అడవుల బాట పట్టారని చర్చించుకుంటున్నారు స్థానికులు
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..