ముఖ్యమంత్రి సారూ.. మాకు రూ.2 వేలు రాలేదు అంటూ నిలదీసిన మహిళలు
ఐదు గ్యారంటీలు అంటూ కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కిందా మీదా పడుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో పథకాల అమలులో ఆ రాష్ట్ర సర్కార్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు గ్యారంటీల గురించి నిలదీస్తున్నారు స్వయానా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భంగపాటుకు గురికాక తప్పలేదు. మహిళలను అడిగి మరీ ఆయన నిలదీతకు గురయ్యారు. తమకు పథకాలు అందలేదని గట్టిగా చెప్పి... తాజాగా సీఎం సిద్ధరామయ్యనే ఖంగుతినిపించారు మహిళలు.
ఐదు గ్యారంటీలు అంటూ కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కిందా మీదా పడుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో పథకాల అమలులో ఆ రాష్ట్ర సర్కార్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు గ్యారంటీల గురించి నిలదీస్తున్నారు స్వయానా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భంగపాటుకు గురికాక తప్పలేదు. మహిళలను అడిగి మరీ ఆయన నిలదీతకు గురయ్యారు. తమకు పథకాలు అందలేదని గట్టిగా చెప్పి… తాజాగా సీఎం సిద్ధరామయ్యనే ఖంగుతినిపించారు మహిళలు. రాష్ట్రంలోని ఓ జిల్లాలో నిర్వహించిన సభలో… గృహలక్ష్మి పథకం లబ్ధి చేకూరుతుందా? అని సీఎం అడిగారు. అయితే ఆయన అడిగినప్పటికీ సభలో ఉన్న మహిళలెవరూ స్పందించలేదు. దీంతో సిద్ధరామయ్యే మళ్లీ కలగజేసుకొని మరోసారి అదే ప్రశ్నను అడిగారు. సిద్ధరామయ్య ప్రశ్నతో మహిళలంతా ఒక్కసారిగా తమకు రాలేదంటే.. తమకు రాలేదని ముక్తకంఠంతో అరిచారు. దీంతో సీఎం సిద్ధరామయ్య ఖంగుతిన్నారు. అంతలోనే తేరుకొని విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే చాలా మందికి పథకం అందుతున్నదని అన్నారు. ఆధార్‌కార్డు లింక్ కాకపోవడం తదితర కారణాల వల్ల కొంతమందికి అందలేదని, వారికి కూడా త్వరలోనే అందిస్తామని చెప్పి చల్లగా జారుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
20 నిమిషాల్లో 5వేల రాకెట్ల వెనుక అసలు కథ ఇది
దేశం కాని దేశంలో ఏం జరిగిందో తెలీదు !! ఇంట్లోనే విగతజీవులుగా కనిపించారు
లాకప్‌లో ఉంచినందుకు రూ.50 వేల పరిహారం.. పోలీసులే చెల్లించాలని ఢిల్లీ కోర్టు ఆదేశం