కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారు.. మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారు.. మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Janardhan Veluru

|

Updated on: Oct 09, 2023 | 5:55 PM

తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడిని సత్కరించాల్సింది పోయి జైల్లో పెట్టడం బాధాకరమని సినీ నటుడు మురళీ మోహన్ అన్నారు. చంద్రబాబు అరెస్టు పట్ల దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలు ఎంతో బాధపడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడికి గ్రహణం పట్టిందని.. అయితే ఈ గ్రహణం ఎన్నో రోజులు ఉండదన్నారు.

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు బాధాకరమన్న మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్.. ఆయన కడిగిన ముత్యంలా జైలు నుండి బయటకు వస్తారని ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన వ్యక్తిని సత్కరించాల్సింది పోయి జైల్లో పెట్టడం బాధాకరమన్నారు. చంద్రబాబు అరెస్టు పట్ల దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలు ఎంతో బాధపడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడికి గ్రహణం పట్టిందని.. అయితే ఈ గ్రహణం ఎన్నో రోజులు ఉండదన్నారు. చంద్రబాబుకు సానుభూతి పెరుగుతోందన్న మురళీ మోహన్.. కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని అన్నారు. చంద్రబాబు మంచి నాయకుడని.. ఆయన అధికారంలోకి వచ్చి ఏపీని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అవుతారని అన్నారు.