నడిరోడ్డుపైనే గిరిజన మహిళ ప్రసవం.. ఆ ఆశ కార్యకర్త లేకుంటే..
ఎంతటి వారికైనా కీలక సమయాల్లో ఆపన్నహస్తం అవసరం అవుతుంది. ఆ క్షణంలో సహకారం అందితే అనుకున్న కార్యం కార్యరూపం దాలుస్తుంది. అదే ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తే.. అవసరం అయినా సమయంలో నేనున్నా అని భరోసా కల్పిస్తే.. అంతకుమించి ధైర్యం ఏముంటుంది చెప్పండి. ఓ గర్భిణీ పట్ల అల్లూరి జిల్లా ఏజెన్సీలో అదే జరిగింది.

అల్లూరి జిల్లా, అక్టోబర్ 17: ఎంతటి వారికైనా కీలక సమయాల్లో ఆపన్నహస్తం అవసరం అవుతుంది. ఆ క్షణంలో సహకారం అందితే అనుకున్న కార్యం కార్యరూపం దాలుస్తుంది. అదే ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తే.. అవసరం అయినా సమయంలో నేనున్నా అని భరోసా కల్పిస్తే.. అంతకుమించి ధైర్యం ఏముంటుంది చెప్పండి. ఓ గర్భిణీ పట్ల అల్లూరి జిల్లా ఏజెన్సీలో అదే జరిగింది. వైద్య సాయం కోసం వెళ్లి తిరిగి వెళుతున్న సమయంలో.. పురిటి నొప్పులు. ఆటోలో ప్రయాణం.. అప్పటికే ఆసుపత్రికి వెళ్లి తిరిగి ప్రయాణం అవుతున్నారు. మార్గం మధ్యలో ఉన్నారు. నొప్పులు ఎక్కువ అవడంతో తోడుగా ఉన్న ఆశ కార్యకర్త ధైర్యం చేసింది. రోడ్డు పక్కనే ఆటో ఆపి.. ఆ మహిళకు ధైర్యం చెప్పింది. సుఖప్రసవం చేసి తల్లి బిడ్డలు క్షేమంగా ఉండేందుకు సహకారం అందించింది. తన బాధ్యత అయినప్పటికీ.. కిలోమీటర్ల దూరం వరకు ఆసుపత్రిలో లేని చోట.. అలా ప్రసవం చేయించాలంటే..
అలా జరిగింది..
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం రేగుబయలుకి చెందిన వసంత 7 నెలల గర్భిణీ. వైద్య పరీక్షల కోసం రేగుబయల నుంచి లంబసింగి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. భర్త, ఆశ కార్యకర్త ఆమెను తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు ఆమెకు పూర్తయ్యాయి. వైద్య పరీక్షల తర్వాత గ్రామానికి ఆటోలో తిరుగు ప్రయాణం అయ్యారు. సగం దూరం వచ్చాక.. వసంతకు ఆరోగ్యంలో మార్పు కనిపించింది. చింతపల్లి అటవీ శాఖ కార్యాలయం సమీపంలోకి వచ్చేసరికి ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వసంత కంగారుపడుతోంది. చెమటలు పడుతూ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఆ సమయంలో ఆ ఆశ కార్యకర్త ఆమెకు ధైర్యం చెప్పింది. తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే కిలోమీటర్ల దూరం. పోనీ గ్రామానికి వెళ్లాలంటే కూడా ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. మార్గంమధ్యలో ఎవరి సహకారం లేదు. దీంతో ఇక ఆ ఆశ కార్యకర్త ధైర్యం చేసింది. ఆటో ఆపి రోడ్డు పక్కనే ప్రసవం చేసింది ఆశ కార్యకర్త. సుఖప్రసవం అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించింది ఆమె. సింగిల్‌గా సిచ్యువేషన్ హ్యాండిల్ చేసింది. వసంతకు కాన్పు జరిగింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
