Andhra Pradesh: క్రిస్మస్ సెలవులతో అరకుకు పోటెత్తిన పర్యాటకులు.. హోటల్ రూమ్స్ హౌస్ ఫుల్..!
ఆంధ్రా ఊటి అరకులోయలో మంచు ముసుగు ఆహ్లాదాన్ని పంచుతోంది. దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలో దట్టంగా కురుస్తున్న పొగమంచు సోయగాలతో ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి. వికెండ్ కు తోడు క్రిస్మస్ వరుస సెలవు దినాలు కావడంతో పర్యాటక ప్రాంతాలకు టూరిస్టుల రద్దీ అమాంతంగా పెరిగింది. మేఘాల కొండలైన వంజంగి, మాడగడ కు పోటెత్తారు పర్యాటకులు. ముందే వచ్చిన సీజన్ తో ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. ఆంధ్రా ఊటి అరకు..

అరకు, డిసెంబర్ 24: ఆంధ్రా ఊటి అరకులోయలో మంచు ముసుగు ఆహ్లాదాన్ని పంచుతోంది. దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలో దట్టంగా కురుస్తున్న పొగమంచు సోయగాలతో ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి. వికెండ్ కు తోడు క్రిస్మస్ వరుస సెలవు దినాలు కావడంతో పర్యాటక ప్రాంతాలకు టూరిస్టుల రద్దీ అమాంతంగా పెరిగింది. మేఘాల కొండలైన వంజంగి, మాడగడ కు పోటెత్తారు పర్యాటకులు. ముందే వచ్చిన సీజన్ తో ఎంజాయ్ చేస్తున్నారు సందర్శకులు. ఆంధ్రా ఊటి అరకు ప్రకృతి అందాలు పులకిస్తున్నాయి. కూల్ క్లయిమేట్ సందర్శకులను ఆహ్వానిస్తోంది. కొండలు, ఘాట్ రోడ్ పై పొగమంచుతో ప్రకృతి అందాలు మరింత సుందరంగా మారాయి. దీంతో సందర్శకులు అరకుకు క్యూ కడుతున్నారు. మారిన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. కెమెరాలో బంధిస్తున్నారు సందర్శకులు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నయి. పాడేరులో 11డిగ్రీలు, అరకులో 12, చింతపల్లిలో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టంగా పొగ మంచు కురుస్తోంది.
నృత్యాలతో సందడి..
అరకుతో పాటు ఏజెన్సీలోని పర్యటక ప్రాంతాలు రద్దీగా మారాయి. కిటకిట లాడుతున్నాయి. కూల్ క్లైమేట్ లో ఏజెన్సీ సోయగాలు మరింత పులకించడంతో వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. అరకులోయ సందర్శిత ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడు తున్నాయి. పాడేరు ప్రాంతంలోని వంజంగి మేఘాల కొండ తో పాటు.. అరకు లోయలోని మాడగడ మేఘాల కొండల్లో పాల సముద్రాన్ని తలపించేలా పొగ మంచు కొమ్ముకుంది. సుందర దృశ్యాలు చూసేందుకు క్యూ కడుతున్నారు జనం. ఇందుకోసం.. సాటర్డే సాయంత్రం నుంచి కాపు కాసారు. సండే సూర్యోదయాన్నె .. కొండల మధ్య లోయలో పాల సముద్రం లాంటి మేఘాలను చూసి ఆస్వాదిస్తున్నారు సందర్శకులు. పొగమంచుతో పాటు చల్లనిగాలులు తోడవడంతో ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఎంతో ఆస్వాదిస్తున్నారు. అరకు, పాడేరు, చింతపల్లి ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు సందర్శకులు. తెల్లవారు జాము నుంచే మాడగడ, వంజంగి వ్యూ పాయింట్ల తో పాటు లంబసింగిలో సందర్శకులు సందడి చేశారు. సూర్యోదయంలో అద్భుతమైన దృశ్యాలను చూస్తూ సెల్ఫీలలో బంధిస్తూ కేరింతలు కొట్టారు. మాడగడలో పర్యాటకలను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా దింసా నృత్యాలను ఏర్పాటు చేశారు.
దారులన్నీ ఏజెన్సీ వైపే.. హోటల్ రూములకు భారీ డిమాండ్
ఇక.. వందలాదిగా వాహనాలు అరకుకు తరలి వస్తుండడంతో ఘాట్రోడ్లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. టూరిస్ట్ లు అధికంగా రావడంతో అద్దె గదులకు బాగా డిమాండ్ ఏర్పడింది. రూములు దొరక్క పోయిన ఖాళీ ప్రదేశాల్లో పర్యాటకులు చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు అద్దె గదులు, హోటళ్లు పూర్తిగా నిండి పోతున్నాయి. రూముల మాట సరే సరే.. హోటల్ గదులు దొరక్క చాలామంది సమస్యలు చలి మంటలు వేసుకొని రోడ్లపై గడిపారు. టూర్కు వచ్చే వాహనాల్లోనే రాత్రి గడప అంటున్నారు మరి కొంతమంది పర్యాటకులు. ఈమధ్య కాలంలో అరకులోయతో పాటు ఏజెన్సీ పర్యాటక ప్రతాలకు ఇంత భారీ స్థాయిలో పర్యాటకులు సందర్శనకు రావడం ఇదేనని స్థానికులు చెబుతున్నారు. సందర్శకులతో సీజన్ అదిరిపోవడంతో.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు పర్యాటకులపై ఆధారపడిన వ్యాపారస్తులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.