Tirumala: తిరుమల అలిపిరి మార్గంలో ఆపరేషన్‌ చీతా కంటిన్యూ.. తల్లి చిరుత కోసం కొనసాగుతోన్న వేట

తిరుమలలో చీతా టెన్షన్‌ కంటిన్యూ అవుతోంది. ఎప్పుడు ఏ చిరుత ఎటువైపు నుంచి ఎటాక్‌ చేస్తుందోనని భయపడిపోతున్నారు భక్తులు. పిల్ల చిరుత పట్టుబడినా తల్లి చిరుత మాత్రం ఇంకా గుబులు రేపుతూనే ఉంది. ఇంతకీ, ఆ తల్లి చిరుత ఎక్కడుంది?. ఆపరేషన్ చీతా ఎంతవరకూ వచ్చిందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. 

Tirumala: తిరుమల అలిపిరి మార్గంలో ఆపరేషన్‌ చీతా కంటిన్యూ.. తల్లి చిరుత కోసం కొనసాగుతోన్న వేట
Alipiri Walk Way
Follow us
Surya Kala

|

Updated on: Jun 25, 2023 | 6:32 AM

చిరుత, ఈ పేరు చేప్తేనే భయంతో వణికిపోతున్నారు తిరుమల శ్రీవారి భక్తులు. చిరుత బాలుడిపై ఎటాక్‌ చేసిన దగ్గర్నుంచీ అలిపిరి నడకమార్గంలో వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికే దాడి చేసిన చిరుతను బంధించినా.. భక్తుల్లో భయం మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. అలిపిరి మార్గంలో మరికొన్ని చిరుతలు తిరుగుతున్నాయనే అనుమానమే భక్తుల ఆందోళనకు కారణం. దాంతో, తిరుమల కొండపై ఆపరేషన్‌ చీతా కంటిన్యూ చేస్తోంది టీటీడీ.

ఆల్రెడీ ఒక చిరుతను పట్టుకున్న ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, దాన్ని దట్టమైన అడవిలోకి తీసుకెళ్లి వదిలిపెట్టింది. అయితే, ఇక్కడే మరో చిరుత తిరుగుతోందన్న సమాచారంతో బోన్లు, ట్రాప్‌ కెమెరాస్‌ ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. బాలుడిపై ఎటాక్‌చేసిన చిరుత వయస్సు ఏడాదిన్నర అయితే, రెండోది చిరుతను దాని తల్లిగా అనుమానిస్తున్నారు.

రెండో చిరుత కోసం వేట కొనసాగిస్తోంది అటవీశాఖ. అయితే, అది తప్పించుకొని తిరుగుతోందంటున్నారు. అసలు, దాని ఆచూకీ కూడా దొరకడం లేదని చెబుతున్నారు. తల్లి చిరుతను పట్టుకునేందుకు రెండుచోట్ల బోన్లు, వందకి పైగా కెమెరాలు పెట్టారు. త్వరలోనే ఆ చిరుతను కూడా పట్టుకుంటామని, అయితే అప్పటివరకూ భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అటవీ అధికారులు. నడక మార్గంలో వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బాలుడిపై ఎటాక్‌చేసిన చిరుత పట్టుబడినా తల్లి చిరుత అక్కడే తిరుగుతోందన్న భయం భక్తులను టెన్షన్‌ పెట్టిస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచొచ్చి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. దాంతో, గాలి గోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు ఆరు కిలోమీటర్ల మేర పోలీస్‌ సెక్యూరిటీ పెంచింది టీటీడీ. చిరుతల సంచారంపై నిఘా పెట్టడంతోపాటు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. మరి, ఈ తల్లి చిరుత చిక్కేదెప్పుడో! భక్తుల్లో భయాందోళనలు తొలగేదెప్పుడో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..