Saturday Remedies: శని దోష నివారణకు శనివారం ఈ 7 పరిహారాలు చేసి చూడండి.. సమస్యల నుంచి విముక్తి..
శనీశ్వరుడి వక్ర దృష్టికి మనుషులే కాదు, దేవతలు కూడా భయపడతారనేది హిందువుల విశ్వాసం. రాముడి నుండి రావణుడి వరకు శనీశ్వరుడి కోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రంలో శని దేవుడి వక్ర దృష్టిని నివారించడానికి కొన్ని చర్యలు ఇవ్వబడ్డాయి. వీటిని అనుసరించడం వలన ప్రయోజనం పొందుతారు.
జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడు పేరు రాగానే అందరూ భయపడతారు. నవ గ్రహాల్లో ఒకటైన శని కర్మ ప్రధాత. కర్మలకు తగిన తగిన శిక్షలను విధించే న్యాయ దేవత. మంచి పనులు చేసేవారు శని అనుగ్రహాన్ని పొందితే.. చేపట్టిన పనిలో ఆటంకాలు లేకుండా విజయాన్ని పొందుతారు. అదే సమయంలో మత విశ్వాసం ప్రకారం శని వక్ర దృష్టి కారణంగా ప్రజలందరూ కూడా భయపడతారు. అటువంటి పరిస్థితిలో కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందవచ్చు.
శనీశ్వరుడి వక్ర దృష్టికి మనుషులే కాదు, దేవతలు కూడా భయపడతారనేది హిందువుల విశ్వాసం. రాముడి నుండి రావణుడి వరకు శనీశ్వరుడి కోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రంలో శని దేవుడి వక్ర దృష్టిని నివారించడానికి కొన్ని చర్యలు ఇవ్వబడ్డాయి. వీటిని అనుసరించడం వలన ప్రయోజనం పొందుతారు.
శనీశ్వరుడి వక్ర ద్రుష్టి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు..
ఎవరికీ ఎప్పుడూ అన్యాయం చేయకండి. అంతేకాదు బలహీనులను హింసించవద్దు. పేదలకు, నిర్భాగ్యులకు సేవ చేయండి. శనీశ్వరుడు ఇలాంటి వ్యక్తుల పట్ల సంతోషంగా ఉంటాడు. ఈ నియమాలను పాటించడం ద్వారా శనీశ్వరుడి చెడు దృష్టి వల్ల కలిగే సమస్యల నుండి బయటపడవచ్చు.
శనీశ్వరుడి తిరోగమన దృష్టి కారణంగా, స్థానికుల జీవితంలో అనేక రకాల సమస్యలు ప్రవేశిస్తాయి. దీనివల్ల ఆరోగ్యం నుంచి వ్యాపారం వరకు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక శని వంకర దృష్టి పడకుండా ఉండాలంటే చేతికి ఇనుప ఉంగరం ధరించాలి.
హిందూమతంలో బాధలను తొలగించడానికి, దేవతల అనుగ్రహంతో ఆశీర్వాదాలు పొందడానికి పూజలకు ఏర్పాట్లు చేయబడ్డాయి. శనీశ్వరుడు సృష్టించిన సమస్యల వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతుంటే, శనివారం నాడు శనిదేవుని ఆలయానికి వెళ్లి ఆవాల నూనెను నైవేద్యంగా పెట్టి 108 సార్లు జపిస్తే మీకు ప్రయోజనం కలుగుతుంది.
మహాదేవుడిని పూజించడం వల్ల శనికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజూ శివుడిని పూజించడం వల్ల శని సంబంధమైన కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం. అంతే కాకుండా శని బాధలు తొలగిపోవడానికి శివుడిని పూజిస్తూ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి.
శనివారం నాడు శని దేవుడి అనుగ్రహం కోసం నీడను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఒక పాత్రలో ఆవనూనె తీసుకుని అందులో రూపాయి నాణెం వేస్తే ఆ నూనెలో మీ ముఖాన్ని చూసుకుని అనంతరం ఆ నూనెను అవసరమైన వారికి దానం చేయండి.
జాతకంలో శని దేవుడి కష్టాలను తొలగించడానికి మహా కాళీ అమ్మవారిని ఆరాధించడం కూడా ఫలవంతంగా పరిగణించబడుతుంది.
శని దేవుడిచ్చే దుష్ప్రభావాలను నివారించడానికి, సంకట్ మోచన బజరంగ బలిని ఆరాధించాలని నమ్ముతారు. తరువాత భైరవుడిని పూజించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).