Astro Tips: ప్రసాదంగా ఇచ్చే పంచామృతం, చరణామృతం మధ్య తేడా.. వేటితో తయారు చేస్తారో తెలుసా..
ఆలయాన్ని సందర్శించే భక్తులకు పూజారులు పంచామృతం, చరణామృతాన్ని ప్రసాదంగా ఇస్తారు. అయితే వాస్తవానికి చరణామృతం, పంచామృతం రెండూ వేర్వేరు అని కొంతమందికి మాత్రమే తెలుసు. రెండింటినీ తయారుచేసే విధానం వేరు... అంతేకాదు రెండు తీర్ధాలకు మత పరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ రోజు చరణామృతం, పంచామృతానికి మధ్య తేడాను తెలుసుకుందాం..
సనాతన ధర్మంలో పూజకు, ఆరాధనకు విశిష్ట స్థానం ఉంది. పూజ సమయంలో వినియోగించే ద్రవ్యాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో పూజ సమయంలో, ఆలయాల్లో, లేదా శుభకార్యంల్లో దేవుళ్ళకు అభిషేకాలు నిర్వహిస్తున్న సమయంలో పంచామృతాలు ఉపయోగిస్తారు. పూజలో వినియోగించే అనంతరం ప్రసాదంగా తీసుకునే చరణామృతం, పంచామృతానికి కూడా పూజలో విశిష్ట స్థానం ఉంది. చరణామృతం, పంచామృతాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు పూజారులు పంచామృతం, చరణామృతాన్ని ప్రసాదంగా ఇస్తారు. అయితే వాస్తవానికి చరణామృతం, పంచామృతం రెండూ వేర్వేరు అని కొంతమందికి మాత్రమే తెలుసు. రెండింటినీ తయారుచేసే విధానం వేరు… అంతేకాదు రెండు తీర్ధాలకు మత పరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ రోజు చరణామృతం, పంచామృతానికి మధ్య తేడాను తెలుసుకుందాం..
పంచామృతం-చరణామృతం మధ్య వ్యత్యాసం పంచామృతంలో ఐదు వస్తువులు మిళితమై ఉంటాయి. భగవంతుడికి స్నానం, అభిషేకం చేయించడానికి పంచామృతం సిద్ధం చేస్తారు. పాలు,పెరుగు, నెయ్యి, నీరు, తేనె ను కలిపి తయారు చేసి పంచామృతాన్ని తయారు చేస్తారు. వీటన్నింటిని కలగలిపి పంచామృతం భగవంతుని అభిషేకానికి రెడీ చేస్తారు. అయితే తులసిని నీటిలో కలిపితే చరణామృతం అవుతుంది.
పంచామృతం అంటే.. పంచామృతం అంటేనే.. ఐదు పవిత్ర వస్తువులతో తయారైందని అర్ధం. ఈ పంచామృతాన్ని తయారు చేయడానికి ఐదు అమృతం వంటి వస్తువులను కలుపుతారు. భగవంతుని అభిషేకానికి, స్నానానికి ఉపయోగిస్తారు. అంతేకాదు సత్యనారయణ స్వామి వ్రతం, శ్రీ కృష్ణ జన్మాష్టమి వంటి సందర్భాల్లో పంచామృతాన్ని తయారు చేసి దేవుడికి అభిషేకం చేస్తారు. అనంతరం ఈ పంచామృతాన్ని ప్రసాదంగా తీసుకుంటారు.
చరణామృతం అంటే.. చరణామృతం అంటేనే భగవంతుని పాదాల అమృతం అని అర్ధం. ఈ అమృతాన్ని సిద్ధం చేయడానికి కొన్ని నియమాలున్నాయి. శాలిగ్రామాన్ని గంగాజలంతో స్నానం చేయిస్తారు. ఇందులో తులసి దళం కూడా కలుపుతారు. అనంతరం స్వామివారి పాదాల నున్న అమృతం వంటి నీరుని ప్రసాద రూపంలో భక్తులకు పంచుతారు. చరణామృతం తీసుకోవడానికి కొన్ని నియమాలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. దాని ప్రకారం చరణామృతం తీసుకోవాలి. చరణామృతాన్ని ఎల్లప్పుడూ కుడిచేతితో మాత్రమే తీసుకోవాలి. సర్వపాపాలను నశింపజేసే ఔషధం వంటి చరణామృతాన్ని ఎప్పుడూ రాగి పాత్రలో తయారుచేయాలి. దేవాలయాలలో చరణామృతాన్ని రాగి పాత్రలలో ఉంచడానికి బహుశా ఇదే కారణం కావచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).