TTD: రాష్ట్రంలో తొలిసారి.. సరోగసీ విధానం ద్వారా జన్మించిన దూడ
ఏపీలో సరోగసీ విధానం ద్వారా తొలి ఆవుడూడ జన్మించింది. ఒంగోలు ఆవు అద్దెగర్భంలో పురుడు పోసుకుంది దేశీయ షాహివాల్ అవుదూడ. దీంతో తిరుపతి వెటర్నరీ వర్సిటీలో ఐవీఎఫ్ ప్రయోగం విజయవంతం అయ్యింది.
అంతరించిపోతోన్న దేశీయ ఆవుల ఉత్పత్తిని పెంచేందుకు సరోగసీ ద్వారా శాస్త్రీయంగా తొలి సరోగేటెడ్ ఆవుకి ఆయువు పోసింది తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ. ఐవీఎఫ్ టెక్నాలజీతో గిర్ ఆవు పిండాన్ని ఒంగోలు ఆవు గర్భంలో ప్రవేశపెట్టి షాహివల్ ఎంబ్రియోను ఒంగోలు జాతి ఆవులో అభివృద్ధి చేశారు. గత ఏడాది ఐవీఎఫ్ టెక్నాలజీని ఉపయోగించి ఆరోగ్యవంతమైన, అధిక ప్రొడక్టివిటీని ఇచ్చే దేశీయ ఆవుల ఉత్పత్తి కోసం వెటర్నరీ యూనివర్సిటీ 3.8 కోట్ల రూపాయల ప్రాజెక్టుని చేపట్టింది. ఐదేళ్ళల్లో 350 సరోగేటెడ్ దూడలు పుట్టించడమే లక్ష్యంగా తిరుపతి వెటర్నరీ వర్సిటీలో ఐవీఎఫ్ ప్రయోగం సక్సెస్ అయ్యింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా 94 సరోగేటివ్ ఆవులను సిద్ధంచేశారు. మరో 18 సరోగేట్ యానిమల్స్ టెస్టింగ్‌లో ఉన్నాయి. 11 ఆవుల్లో ఎంబ్రియో ట్రాన్సఫర్ చేశారు. సరోగసీ విధానం ద్వారా మరో రెండు రోజుల్లో ఇంకో రెండు దూడలకు జన్మనివ్వనున్నాయి సరోగేటెడ్ ఆవులు. శ్రీవారి ఆలయంలో రోజుకు 2500 లీటర్ల పాలు అవసరం కాగా, ఇందులో రోజుకు 500 దేశీయ ఆవుపాలు అవసరం ఉంది. స్వదేశీ అవుల సంతతి మరింతగా పెరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పద్మనాభరెడ్డి.
వాయిస్ : సరోగసీ కోసం మరో 5 మంది దాతలు 500 ఆవులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు ఈవో ధర్మారెడ్డి. రామమయం ట్రస్ట్ వాళ్ళు 100 ఆవులు, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ 70 ఆవులు డొనేట్ చేసినట్టు చెప్పారు. రానున్న 5 ఏళ్ల లో టిటిడి గోశాలలో వెయ్యి ఆవుల్ని సిద్ధం చేసి, శ్రీవారి ఆలయం, అమ్మవారి ఆలయం అవసరాలకోసం వినియోగిస్తామన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..