AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బాలుడుని ఎత్తుకెళ్లిన చిరుత చిక్కింది.. అలిపిరిలో బంధించిన ఫారెస్ట్ అధికారులు..

మొన్న తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి ప్రత్యక్షమైంది. ఏడో మైలు దగ్గర బాలుడిపై దాడి చేసింది. అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. వెంటనే గమనించిన బాలుడి తాత, భక్తులు కేకలు వేస్తూ అటవీ ప్రాంతంలో చిరుతను వెంబడించారు.

Andhra Pradesh: బాలుడుని ఎత్తుకెళ్లిన చిరుత చిక్కింది.. అలిపిరిలో బంధించిన ఫారెస్ట్ అధికారులు..
Leopard
Shiva Prajapati
|

Updated on: Jun 24, 2023 | 9:49 AM

Share

బాలుడిపై దాడి చేసిన చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. చిరుత బంధించిన రంగంలోకి దిగిన అధికారులు.. రెండుచోట్లు బోన్లతో పాటు.. 100కు పైగా ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం బోనులు ఏర్పాటు చేయగా.. రాత్రి 11 గంటలకు చిరుత బోనులో చిక్కింది. దాంతో ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. చిరుత బోనులో చిక్కడంతో అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ చిరుతకు ఏడాదిన్నర వయసు ఉంటుందని, ఇప్పుడిప్పుడే వేటాడే లక్షణాలు అలవాటు అవుతున్నాయని టీటీడీ డీఎఫ్ఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ కారణంగానే బాలుడిని లాక్కెళ్లిన సమయంలో వదిలేసినట్లు అధికారులు తెలిపారు. వేటాడే లక్షణాలు లేవు కాబట్టే బాలుడు బయటపడగలిగాడని తెలిపారు. ఈ చిరుత పిల్లిని వేటాడుతూ భక్తులు వెళ్లే మార్గంవైపు వెళ్లిందని.. పిల్లి తప్పించుకోవడంతో బాలుడిపై దాడికి ప్రయత్నించిందన్నారు. ఈ ఘటన యాధృచ్చికంగా జరిగిన ఘటనగా చెబుతున్నారు అధికారులు. ఈ చిరుత తల్లి నుంచి ఈ మధ్యే వేరుగా ఉంటోందని.. పిల్లి అనుకుని బాలుడిని వేటాడే ప్రయత్నం చేసిందన్నారు. ప్రస్తుతం బోనులో చిక్కిన ఈ చిరుతను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేస్తామని తెలిపారు ఫారెస్ట్ అధికారులు.

ఇదిలాఉంటే.. చిరుత దాడి నేపథ్యంలో రాత్రి 7 గంటల తర్వాత గాలిగోపురం నుంచి 2 వందల మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపించేలా ఏర్పాటు చేశామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. వీరితో పాటు సెక్యూరిటీ గార్డు ఉంటారని అన్నారు. చిన్న పిల్లలు బృందం మధ్యలో ఉండేలా చూసుకోవాలని భక్తులకు సూచించారాయన. శ్రీవారి మెట్ల మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి నడక మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తామని ఈవో తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..