Andhra Pradesh: ఇక కాస్కోండి.. ప్రత్యర్థులపై ఎమ్మెల్యే అనిల్ సంచలన కామెంట్స్..
ఇన్నాళ్లూ ఒక లెక్క-ఇకనుంచి మరో లెక్క అంటున్నారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్. ఇక కాస్కోండి, నేనేంటో చూపిస్తా అంటూ ప్రత్యర్ధులకు సవాల్ విసిరారు. ఎవ్వడు అడ్డొచ్చినా బుల్లెట్ ట్రైన్ స్పీడ్‌తో గుద్దేస్తానంటూ బాలయ్య స్టైల్లో దుమ్మురేపే డైలాగ్స్ వదిలారు.
ఇన్నాళ్లూ ఒక లెక్క-ఇకనుంచి మరో లెక్క అంటున్నారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్. ఇక కాస్కోండి, నేనేంటో చూపిస్తా అంటూ ప్రత్యర్ధులకు సవాల్ విసిరారు. ఎవ్వడు అడ్డొచ్చినా బుల్లెట్ ట్రైన్ స్పీడ్‌తో గుద్దేస్తానంటూ బాలయ్య స్టైల్లో దుమ్మురేపే డైలాగ్స్ వదిలారు. 2024లో మళ్లీ నేనే పోటీచేస్తా, హ్యాట్రిక్ కొడతా, ఎవ్వడు ఆపుతాడో చూస్తా.. అంటున్నారు అనిల్‌కుమార్ యాదవ్.
చిన్న బ్రేక్ ఇచ్చా అంతే. తనలోని ఆ ఫైర్ అలాగే ఉంది. ఎందుకులే అని కామ్‌గా ఉంటే కొందరు రెచ్చిపోతున్నారు. ఇక కాస్తోండి, నేనేంటో చూపిస్తా అంటూ ప్రత్యర్ధులకు సవాల్ విసిరారు అనిల్‌కుమార్ యాదవ్. సినీ స్టైల్లో పంచ్ డైలాగ్‌లతో చెలరేగిపోయారు. ఎవ్వడికీ తలవంచేదే లేదన్నారు. ఎంత పెద్దోడు ఎదురొచ్చినా రొమ్ము చీల్చుకుంటూ ముందుకెళ్తా. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ మీరు ఆడుకున్నారు, ఇకపై అనిల్ ఆట ఎలాగుంటుందో చూస్తారంటూ ప్రత్యర్ధులకు వార్నింగ్ ఇచ్చారు. పిల్లాడోగిగా ఉన్నప్పుడే ఓ పెద్ద కుటుంబాన్ని ఓ ఆటాడుకున్నా, నెల్లూరులో వాళ్ల పేరే వినిపించకుండా చేశా. అది అనిల్‌కుమార్ యాదవ్ సత్తా అంటూ ఉగ్రరూపం చూపించాడు. పార్టీ మార్పు ప్రచారంపైనా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు అనిల్. ఎన్ని కుట్రలు చేసినా తనను జగన్‌కి దూరం చేయలేరన్నారు. తన గుండెను కోస్తే వచ్చేది జగన్ బ్లడ్డే అన్నారు అనిల్. జగన్‌కి మిలిటెంట్ స్క్వాడ్‌లాంటోడిని. నా గుండె చప్పుడు జగన్. నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకూ జగన్‌తో అంటూ కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు అనిల్‌కుమార్ యాదవ్.
2024లో మళ్లీ నేనే పోటీచేస్తా, హ్యాట్రిక్ కొడతా, ఎవ్వడు ఆపుతాడో చూస్తా.. అంటూ బాలయ్య స్టైల్లో దుమ్మురేపే కామెంట్స్ చేశారు. తనకు ఎవ్వడు అడ్డొచ్చినా బుల్లెట్ ట్రైన్ స్పీడ్‌తో గుద్దేస్తా, వందలకోట్లు ఖర్చుపెట్టినా తన విజయాన్ని ఆపలేరన్నారు అనిల్. అయితే, జగన్ ఈసారి వద్దంటే మాత్రం సంతోషంగా తప్పుకుంటానంటూ కీలక కామెంట్స్ చేశారు. మొత్తానికి ఆత్మీయ సమావేశం పేరుతో నెల్లూరు వైసీపీలో పెద్ద అలజడే రేపారు అనిల్‌కుమార్ యాదవ్. ఇకపై పాత అనిల్‌ను చూస్తారంటూ ప్రత్యర్ధులకు హెచ్చరికలు పంపాడు. మరి, ఇకనుంచి సింహపురిలో పొలిటికల్ హీట్ ఎలా ఉండబోతోందో చూడాలి మరి.
మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..