AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ అందుబాటులోకి ఆర్జిత సేవలు

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌..రెండేళ్లుగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తోంది టీటీడీ. ఏప్రిల్‌ 1 నుంచి ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయి. ఈ నెల 20న ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ అందుబాటులోకి  ఆర్జిత సేవలు
Srivari Temple
Ram Naramaneni
|

Updated on: Mar 18, 2022 | 2:33 PM

Share

Ttd: కరోనాతో రెండేళ్లుగా నిలిచిపోయిన ఆర్జిత సేవలను మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తోంది టీటీడీ. కొవిడ్‌ కేసులు కాస్త తగ్గడంతో ఆర్జిత సేవలకు అనుమతి ఇచ్చింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1నుంచి ఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌, మే, జూన్‌ 3 నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 20న ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేయనుంది టీటీడీ. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజ పాద దర్శనం తదితర ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తారు. ఈనెల 20న ఉదయం 10 గంటల నుంచి 22ఉదయం 10 గంటల వరకు రెండ్రోజుల పాటు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. టికెట్లు పొందిన వారి జాబితాను 22న ఉదయం 10 గంటల తరువాత వెబ్‌సైట్‌లో ఉంచుతారు. భక్తులకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. టికెట్లు పొందిన భక్తులు 2 రోజుల్లోపు వాటి ధర చెల్లించాల్సి ఉంటుంది.

ఇక కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను భక్తులు నేరుగా బుక్‌ చేసుకోవచ్చు. ఐతే పర్వదినాల్లో మాత్రం పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ కానీ..రెండు డోసుల వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.

Also Read: Andhra Pradesh: ఆస్పత్రి నుంచి గంటగంటకీ ఓ సెల్ఫీ.. ఏపీ వైద్యశాఖలో ప్రకంపనలు రేపుతోన్న ఆదేశాలు