Tirumala: తిరుమలలో అన్నమయ్య ప్రాజెక్టుకు పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలని అన్నమయ్య వంశీకుల విజ్ఞప్తి

Tirumala: వాగ్గేయకారుడు, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడు.. తాళ్ళపాక అన్నమాచార్యులు(Annamayya)  జ్ఞాపకాలను చెరిపివేసేందుకు టీటీడీ (TTD) పూనుకుంటోందని జానపద వృత్తి కళాకారుల సంఘం సంచలన ఆరోపణలు..

Tirumala: తిరుమలలో అన్నమయ్య ప్రాజెక్టుకు పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలని అన్నమయ్య వంశీకుల విజ్ఞప్తి
Tirumala Annamayya
Follow us
Surya Kala

|

Updated on: Mar 18, 2022 | 2:55 PM

Tirumala: వాగ్గేయకారుడు, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడు.. తాళ్ళపాక అన్నమాచార్యులు(Annamayya)  జ్ఞాపకాలను చెరిపివేసేందుకు టీటీడీ (TTD) పూనుకుంటోందని జానపద వృత్తి కళాకారుల సంఘం సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు  తిరుమల కొండపై శతాబ్దాలుగా ఉన్న అన్నమయ్య నివాసాన్ని 2003లో టీటీడీ కూల్చివేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తిరుమల కొండమీద ఉన్న అన్నమయ్య జ్ఞాపకాలను చెరిపివేయొద్దని టీటీడీకి  అన్నమయ్య వంశీకుల విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ టీటీడీ ఆ విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  మాస్టర్ ప్లాన్ లో భాగంగా తొలగించిన అన్నమయ్య నివాసం, అన్నమయ్య గుర్తులు, జ్ఞాపకాలను పునరుద్ధరిస్తామని టీటీడీ హామీ ఇచ్చి మర్చింది.. 2007లో అప్పటి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సైతం హామీ నిచ్చారని అయినప్పటికీ ఆ హామీలు అమలు కాలేదని అన్నారు. తిరుమల కొండపై అన్నమయ్య జ్ఞాపకాలు లేకుండా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

19 ఏళ్లుగా అన్నమయ్య వంశీకులు ప్రభుత్వాలకు, టీటీడి యాజమాన్యానికి చేసిన వినతులకు అతీగతీ లేదు. తిరుపతిలోని అన్నమాచార్య ప్రాజెక్టును కూడా టీటీడీ నిర్వీర్యం చేసింది. కనీసం ధూప, దీప నైవేధ్యాలతో అన్నమయ్య విగ్రహానికి పూజాధికార్యక్రమలు కూడా నిర్వహించే పరిస్థితి లేదని చెప్పారు విజయ శంకర స్వామి. టీటీడీలో అన్నమయ్య ప్రాజెక్టుకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని జానపద వృత్తి కళాకారుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. Also Read:

 ఆస్పత్రి నుంచి గంటగంటకీ ఓ సెల్ఫీ.. ఏపీ వైద్యశాఖలో ప్రకంపనలు రేపుతోన్న ఆదేశాలు

అక్కడ చెప్పులతో ఒకరినొకరు కొట్టుకుంటూ హొలీ వేడుకలు.. ఎందుకంటే