AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి హుండీ కానుకలతో నిండుతున్న కొండ ఖజానా.. జూలై నెల ఆదాయం ఎంత అంటే..?

Tirupati: రూ.17 వేల కోట్ల డిపాజిట్లు, 11 టన్నుల బంగారు బ్యాంకుల్లో వెంకన్న నిధి భద్రంగా ఉండగా నెల నెలా పెరుగుతున్న హుండీ ఆదాయం శ్రీనివాసుడ్ని మరింత సంపన్నుడ్ని చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 7 నెలల్లో హుండీ కి రూ. 827 కోట్లకు పైమాటే.

శ్రీవారి హుండీ కానుకలతో నిండుతున్న కొండ ఖజానా.. జూలై నెల ఆదాయం ఎంత అంటే..?
Tirupati
Raju M P R
| Edited By: |

Updated on: Aug 02, 2023 | 6:01 PM

Share

తిరుపతి, ఆగస్టు 2: తిరుమలేశుడి హుండీ కానుకలతో కొండ ఖజానా నిండుతోంది. ఇప్పటికే రూ.17 వేల కోట్ల డిపాజిట్లు, 11 టన్నుల బంగారు బ్యాంకుల్లో వెంకన్న నిధి భద్రంగా ఉండగా నెల నెలా పెరుగుతున్న హుండీ ఆదాయం శ్రీనివాసుడ్ని మరింత సంపన్నుడ్ని చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 7 నెలల్లో హుండీ కి రూ. 827 కోట్లకు పైమాటే. ప్రతినెల రూ. 120 కోట్ల మార్క్ ను రీచ్ అవుతున్న శ్రీవారి హుండీ ఆదాయం వెంకన్నను మరింత రిచెస్ట్ గార్డ్ ను చేస్తోంది.

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు..వెలకట్టలేని ఆభరణాలు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న అలంకార ప్రియుడు. ఆపదమొక్కుల స్వామికి సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా పరమ భక్తుడే. నాటి నుంచి నేటి వరకు భక్తులు ముక్కులో భాగంగా సమర్పించే కానుకలు ఇప్పుడు వెంకన్న హుండీని నింపేస్తున్నాయి. ఇప్పటికే 11 టన్నుల బంగారు ఆభరణాలు, రూ. 17 వేల కోట్ల రూపాయలు బ్యాంకులు డిపాజిట్ ఉన్న వెంకన్నకు రోజురోజుకు హుండీ లో కానుకల వెల్లువ కొనసాగుతోంది. కోరుకున్న కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కలియుగ దైవం కొండపై కటాక్షిస్తుండటం తో రికార్డ్ స్థాయిలో హుండీ కానుకలు టీటీడీ ఆదాయాన్ని పెంచేస్తున్నాయి. ఏడాది జనవరి నుంచి జూలై వరకు 7 నెలల్లో ఏడుకొండలవాడికి రూ. 827 కోట్ల కు పైగా ఉండి ఆదాయం వచ్చింది. జూలై నెలలో రికార్డు స్థాయిలో రూ.129.3 కోట్ల కానుకలు శ్రీవారి హుండీకి చేరాయి.

ఇవి కూడా చదవండి

జూలై నెలలో 23.23 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా జూలై 10, 17, 24, 31 తేదీల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5 కోట్ల కు పైగానే ఉంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 7 నెలల్లో 12 రోజులు హుండీ ఆదాయం రూ. 5 కోట్ల మార్క్ ను దాటింది. ఇలా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు హుండీ ని కానుకలతో నింపేస్తుండగా ఈ 7 నెలల్లోనే శ్రీవారి హుండీ మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. జనవరి 2న తిరుమల పరకామణిలో శ్రీవారి హుండీ లెక్కింపు సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది. ఏకంగా జనవరి 2 హుండీ కానుకలు మొత్తం రూ. 7,68,20,000 లు గా తేల్చింది. ఈ లెక్కన సరికొత్త రికార్డుగా వెంకన్న హుండీ ఆదాయం నమోదైంది.