Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాలిబాట మార్గంలో మళ్లీ ఎలుగుబంటి ప్రత్యక్షం.. షాకింగ్ వీడియో
Tirumala Tirupati News: తిరుమలలో జంతువులు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ చిరుత పులి చిన్నారిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి భక్తుల్లో మరోసారి భయాందోళన నెలకొంది. తిరుమల కాలిబాట మార్గంలో మరోసారి ఎలుగుబంటి ప్రత్యక్షం అయింది. కాలిబాట మార్గంలో అర్ధరాత్రి ఒంటిగంటా ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తూ కనిపించింది.
తిరుపతి, ఆగస్ట్ 1: తిరుమలలో జంతువులు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ చిరుత పులి చిన్నారిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి భక్తుల్లో మరోసారి భయాందోళన నెలకొంది. తిరుమల కాలిబాట మార్గంలో మరోసారి ఎలుగుబంటి ప్రత్యక్షం అయింది. కాలిబాట మార్గంలో అర్ధరాత్రి ఒంటిగంటా ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. కాలిబాట ప్రాంతంలో జంతువుల సంచారం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే పకడ్బంధీ చర్యలు తీసుకుంది. సిబ్బందిని మోహరించడంతోపాటు.. జంతువులు ప్రవేశించకుండా వలను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా జంతువులు ఎక్కువగా సంచరించే ప్రాంతంలో ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలోనే కాలిబాట మార్గంలో ఎలుగుబంటి కనిపించడం కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి సరిగ్గా ఒంటిగంట ప్రాంతంలో జింకల పార్కు వద్ద ఎలుగుబంటి ప్రత్యక్షమైనట్లు అధికారులు పేర్కొన్నారు. కాలిబాట మార్గంలో గోడ దూకి లోపలికి వచ్చిన ఎలుగుబంటి.. మరోవైపునకు వెళ్లిపోయింది. అయితే, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో చూడండి..
తిరుమల కాలిబాట మార్గంలో జింకల పార్కు వద్ద సోమవారం అర్ధరాత్రి కనిపించిన ఎలుగుబంటి ప్రత్యక్షం#Tirumala #Bear pic.twitter.com/uzA6nbzQgL
— Janardhan Veluru (@JanaVeluru) August 1, 2023
తిరుమల వెళ్లే భక్తులు కాలిబాట మార్గంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలోనే మళ్లీ ఎలుగుబంటి కనిపించడం.. భక్తుల్లో ఆందోళన నెలకొంది. అయితే, టీటీడీ మాత్రం ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, భద్రతను పెంచామని స్పష్టంచేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..