Telangana: దొంగలు బాబోయ్.. కూరగాయల దొంగలు.. బాక్సుల కొద్దీ టమాటా, చిక్కుడు కాయల చోరీ..
Sangareddy: ఇలా మార్కెట్ లో కూరగాయల దొంగలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు..అసలే ప్రస్తుతం మార్కెట్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో ఇదే అదునుగా భావించి కొంతమంది దొంగలు పలు మార్కెట్ లలో అర్ధరాత్రి పూట దొంగతనాలకు పాల్పడుతుడడం దారుణం అంటూ రైతులు, వ్యాపారులు వాపోతున్నారు
Telangana: మార్కెట్లలో దొంగల హవా నడుస్తుంది..ఆ దొంగలు కూడా దొంగతనం చేసేది బంగారం, వజ్రాలు కాదు.. వాటికంటే కూడా ప్రస్తుతం విలువైనవిగా పెరున్నవి దొంగతనం చేస్తున్నారు..గత కొంతకాలంగా దొంగలు బంగారం, వజ్రాలను వదిలిపెట్టి టమాటాలను దొంగతనం చేస్తున్నారు..గత కొద్దిరోజులుగా మార్కెట్లో టమాట ధర పెరగడంతో టమాటా దొంగలు కూడా పెరిగిపోయారు. సంగారెడ్డి జిల్లాలో ఇలా తరచూ టమాటా చోరీలు జరుగుతున్నాయి..మొన్న జహీరాబాద్ మార్కెట్లో టమాట దొంగతనం మరువక ముందే తాజాగా నేడు సదాశివపేట పట్టణంలో గుర్తుతెలియని దుండగులు మార్కెట్లో ఉన్న ఒక షాపులో టమాటాలతో పాటు ఇతర కూరగాయలను కూడా లూటీ చేశారు.
దాశివపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్లో చోరీకి పాల్పడిన దొంగలు..ఓ షాపులో నిల్వ ఉంచిన ఆరు బాక్స్ ల టమాటలను, రెండు బాక్స్ ల చిక్కుడు కాయలను ఎత్తుకెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లిన టమాటాలు, కూరగాయల విలువ సుమారు 30 వేల రూపాయల వరకు ఉంటుందని, ఖరీదు కాలంలో తనకు భారీ నష్టం వాటిల్లిదంంటూ సదరు దుకాణ యజమాని వాపోయారు. జరిగిన విషయంపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
అయితే, అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను గుర్తించడం కష్టంగా ఉందని షాప్ యజమానికి పోలీస్ అధికారులు తెలిపారు. ఇలా మార్కెట్ లో కూరగాయల దొంగలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు..అసలే ప్రస్తుతం మార్కెట్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో ఇదే అదునుగా భావించి కొంతమంది దొంగలు పలు మార్కెట్ లలో అర్ధరాత్రి పూట దొంగతనాలకు పాల్పడుతుడడం దారుణం అంటూ రైతులు, వ్యాపారులు వాపోతున్నారు..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..