- Telugu News Photo Gallery Add aloe Vera to your diet to get these amazing health benefits besides skincare
Health Tips: కలబందతో అందమే కాదు ఆరోగ్యం కూడా.. ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కారణంగానే అనేక కాస్మటిక్స్ తయారీలో కలబందను వాడతారు. ఇంకా చాలా మంది హోమ్ రెమెడీ రూపంలో కూడా కలబందను తీసుకుంటారు. అయితే కలబంద కేవలం అందానికే కాక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మన శరీరానికి కావాలసిన పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ క్రమంలో కలబందతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 31, 2023 | 4:41 PM

విటమిన్లు: కలబందలో విటమిన్ ఎ, సి, ఇ.. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక మినరల్స్ ఉన్నాయి. ఇంకా కలబందలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యం స్థిరంగా ఉండడానికి ఉపయోగపడతాయి.

జీర్ణక్రియ: కలబందలోని ఎంజైములు పోషకాల శోషణ ప్రక్రియను మెరుగుపరచడంలో ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకా ఇందులోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తాయి.

రోగనిరోధక శక్తి: కలబందలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంతో సహాయపడతాయి.

బరువు తగ్గడం: ముందుగా చెప్పుకున్నట్లు కలబంద జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది పరోక్షంగా బరువు తగ్గేలా ప్రభావితం చేస్తుంది.

ఎముకల దృఢత్వం: కలబందలోని కాల్షియం ఎముకల పటిష్టతకు చాలా అవసరమైన పోషకం. ఇది మీ ఎముకలను బలోపేతం చేస్తుంది.




