Health: ఉదయాన్నే లేవగానే ఈ ఒక్క పని చేస్తే అస్సలు రోగాలే రావు.. ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు..
Morning Health Tips: వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ సమయంలో వైరస్‌లు, బ్యాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధులకు దూరంగా ఉండాలంటే తెల్లవారుజామున నిద్రలేచి చిన్నపాటి పని చేస్తే.. ఇన్‌ఫెక్షన్‌ల ముప్పు నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో అంటు వ్యాధులను నివారించడానికి
Updated on: Jul 31, 2023 | 5:36 PM

Morning Health Tips: వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ సమయంలో వైరస్‌లు, బ్యాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధులకు దూరంగా ఉండాలంటే తెల్లవారుజామున నిద్రలేచి చిన్నపాటి పని చేస్తే.. ఇన్‌ఫెక్షన్‌ల ముప్పు నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో అంటు వ్యాధులను నివారించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే వాటిపై దృష్టి పెట్టాలంటున్నారు.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కరోజులో జరిగే పని కాదు. ఇది నిరంతర ప్రక్రియ.. అందుకే అజాగ్రత్తగా వ్యవహరించకుడదు.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉదయం పూట ఎలాంటి పని చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉత్తమ మార్గం కొన్ని చర్యలతో రోజును ప్రారంభించాలి.. అవి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదం దూరంగా ఉంటుంది. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తాగితే, అది మీ రోగనిరోధక శక్తిని చాలా వేగంగా పెంచుతుంది. ఇంకా అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అందుకే ఉదయాన్నే గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..

వర్షాకాలంలో ఫ్లూ ఇన్ఫెక్షన్ సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో, ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా శ్వాసకోశ సంక్రమణను నివారించవచ్చు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతుంది.. ఇంకా సాధారణ దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ దూరమవుతాయి. గోరువెచ్చని నీరు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. చర్మం, జీర్ణక్రియ సమస్యలను కూడా దీని ద్వారా అధిగమించవచ్చు.

వర్షాకాలంలో ఫ్లూ ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి కారడం, మూసుకుపోవడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. ముక్కు మూసుకుపోవడం, సైనస్ సమస్యకు కూడా వేడి నీటిని తాగడం లేదా కొద్దిగా ఆవిరి పట్టడం ద్వారా ఇది తొలగిపోతుంది. 2008 సంవత్సరంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో వేడి పానీయాలు ముక్కు కారటం, దగ్గు, గొంతు నొప్పి, అలసట నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయని కనుగొన్నారు.

జీర్ణక్రియ సమస్య దూరమవుతుంది: వర్షాకాలంలో జీర్ణక్రియ సమస్యలు పెరుగుతాయి. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ సమస్య మెరుగుపడుతుంది. వేడి నీరు కడుపు, ప్రేగుల గుండా వెళ్ళినప్పుడు, వ్యర్థాలను బాగా తొలగించడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా మారుతుంది. ఇంకా జీవక్రియను మెరుగుపరచడంతోపాటు.. కడుపు సమస్యలను నయం చేసి ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.





























