- Telugu News Photo Gallery These are Reasons why you must stop checking your phone early in the morning
Smart Phone: నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? ఐతే జాగ్రత్త..
స్మార్ట్ ఫోన్ చేతిలోకొచ్చాక ప్రతి ఒక్కరూ ఫోన్‌లో తలలు దూర్చి ప్రపంచాన్ని మరచిపోతున్నారు. ఒక్క నిమిషం ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయినట్లు కంగారు పడిపోతున్నారు. ఇక ఇంటర్నెట్ అగిపోతే ప్రపంచం మొత్తం స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. కొంతమంది పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి అర్థరాత్రి వరకు ఫోన్‌తోనే గడిపేస్తుంటారు. ఫోన్, ఇంటర్నెట్ లేకుండా అస్సలు ఉండలేని విధంగా అడిక్టయి పోతున్నారు. ఉదయాన్నే మేల్కొనగానే తొలుత ఫోన్ చూసే అలవాటు మనలో చాలామందికి ఉంది. కానీ ఈ అలవాటు కళ్ల..
Updated on: Jul 31, 2023 | 4:53 PM

స్మార్ట్ ఫోన్ చేతిలోకొచ్చాక ప్రతి ఒక్కరూ ఫోన్‌లో తలలు దూర్చి ప్రపంచాన్ని మరచిపోతున్నారు. ఒక్క నిమిషం ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయినట్లు కంగారు పడిపోతున్నారు. ఇక ఇంటర్నెట్ అగిపోతే ప్రపంచం మొత్తం స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది.

కొంతమంది పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి అర్థరాత్రి వరకు ఫోన్‌తోనే గడిపేస్తుంటారు. ఫోన్, ఇంటర్నెట్ లేకుండా అస్సలు ఉండలేని విధంగా అడిక్టయి పోతున్నారు. ఉదయాన్నే మేల్కొనగానే తొలుత ఫోన్ చూసే అలవాటు మనలో చాలామందికి ఉంది. కానీ ఈ అలవాటు కళ్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు.

ఫోన్‌లో వచ్చే నోటిఫికేషన్లు, చెడు వార్తలు రోజంతా మీపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనాల్లో బయటపడింది. టైం చూడటానికో, అలారం ఆపడానికో మరేదైనా కారణం కావచ్చు. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవడమే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పొద్దున్నే లేవగానే ఫోన్ చెక్ చేసుకునే బదులు బెడ్ పక్కన టేబుల్‌పై గడియారం పెట్టుకోవడం, అలారం గడియారం పెట్టుకోవచ్చు. అలాగే ఫోన్‌లో సోషల్ మీడియను చెక్ చేసుకోకుండా ఓ మంచి పుస్తకం, న్యూస్ పేపర్ లేదా ఏదైనా మ్యాగజైన్ చదవడం అలవాటు చేసుకుంటే కొత్త విషయాలు తెలుసుకోవడంతోపాటు జ్ఞానం వృద్ధి అవుతుంది.

నిద్ర లేవగానే ధ్యానం చేస్తే రోజంతా మనుస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇష్టమైన వ్యక్తులతో ఉదయాన్నే కాసేపు మాట్లాడండి. ఆ రోజు చేయాల్సిన పనులను నోట్ చేసుకోవడం, ఇతర ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం వంటి అలవాట్లను అలవర్చుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు దూరం అవడంతోపాటు మీ రోజు వారీ జీవితం చురుకుగా ఉంటుంది.





























