Monthly Horoscope (August 2023): వారి సంపాదన భారీగా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి ఆగస్టు మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?

August 2023 Monthly Horoscope: జ్యోతిష్య రీత్యా గ్రహాలు, నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలా? స్నేహితుల నుంచి సహాయ, సహకారాలు అందుతాయా? ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఆగస్టు మాసంలో మేషం, వృషభం, మిథునం తదితర 12 రాశుల వారి మాసఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 31, 2023 | 3:20 PM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ నెలంతా గురు, శని, శుక్ర, కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల శుభ ఫలితాలు ఎక్కు వగా అనుభవానికి వస్తాయి. రాశ్యధిపతి అయిన కుజుడు మిత్రరాశి అయిన సింహ రాశిలో ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతున్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం. ముఖ్యమైన పనులు సానుకూలపడడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. విదేశీయానానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు అక్కడ స్థిరత్వం సంపాదించే అవకాశం కూడా ఉంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలితాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన రోజులు. వృత్తి, వ్యాపారాల్లో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. భరణి నక్షత్రం వారికి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఈ నెల ద్వితీయార్థం కంటే ప్రథమార్థం చాలా బాగుంటుంది.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ నెల ఈ రాశివారికి శని, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఎక్కువగా శుభ వార్తలు వినడానికి, ఆకస్మిక ధనలాభం కలగడానికి, ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం కావ డానికి అవకాశం ఉంటుంది. ద్వితీయార్థం కంటే ప్రథమార్థం చాలా బాగుంటుంది. అందువల్ల మొదటి పదిహేను రోజుల్లో వీలైనన్ని వ్యవహారాలను చక్కబెట్టుకోవడం చాలా మంచిది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభ సమాచారం అందుతుంది. తల్లితండ్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబపరంగా అభివృద్ధి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడంతో మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగానే నెరవేరుతాయి. ఇతరుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. కృత్తికా నక్షత్రం వారికి సమయం మరింత అనుకూలంగా ఉంది.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గురువు, రాశినాథుడైన బుధుడు, రాహువు అనుకూలంగా ఉన్నందువల్ల, తప్పకుండా వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత స్థితికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆటంకాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. సాధారణంగా ఏది కోరుకుంటే అది జరుగుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఇతరులకు ఆర్థిక సహాయం అందించగల స్థితికి చేరుకుంటారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ సాను కూలంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. అవాంఛనీయ పరిచయాలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో భద్రత, స్థిరత్వం లభిస్తాయి. పునర్వసు వారికి అనుకోని మంచి గుర్తింపు లభిస్తుంది.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశివారికి ఈ నెల 18 వరకూ కుజ గ్రహం, ఈ నెలంతా రవి, బుధులు అనుకూలంగా ఉన్నందువల్ల శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల పరంగా మంచి జరిగే సూచనలున్నాయి. ప్రమోషన్లు రావడమో, జీతభత్యాలు పెరగడమో జరగవచ్చు. కుటుంబపరంగా కూడా శుభ వార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడు తుంది. వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరగడం జరగవచ్చు. దశమ స్థానంలో రాహు సంచారం వల్ల స్నేహితులు, సహచరుల వల్ల కొద్దిగా మోసపోయే సూచనలున్నాయి. రవి, కుజ గ్రహాల సంచారాన్ని బట్టి ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత బాగుండే అవకాశం ఉంటుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సంతానం లేని వారికి సంతానయోగం పట్టే అవకాశం కూడా ఉంది. కోపతాపాలు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. పుష్యమి నక్షత్రం వారి మనసులోని కోరికలు నెరవేరుతాయి.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశివారికి ఈ నెలంతా గురు, కుజ, బుధ గ్రహాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. విదేశీయానానికి, విదేశాల్లో స్థిరత్వానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి పలుకుబడి పెరుగుతుంది. దాదాపు ఈ నెలంతా ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి అనుకూల సమయం నడుస్తోంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేసే సూచనలున్నాయి. విదేశాలలో వృత్తి, ఉద్యోగాలలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. హామీలు ఉండవద్దు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావా దేవీల వల్ల ఇబ్బంది పడతారు. పుబ్బ నక్షత్రం వారికి ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశివారికి శని, రవి, బుధులు అనుకూలంగా ఉన్నందువల్ల, వ్యక్తిగత, కుటుంబ సమస్యల పరి ష్కారం మీద దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఏ ప్రయత్నానికైనా ప్రథమార్థం అనుకూలంగా ఉంది. మొదటి పదిహేను రోజుల్లో ముఖ్యమైన పనుల చక్కబెట్టుకోవడం మంచిది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర వ్యవహారాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. అనవ సర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. అష్టమ స్థానంలో సంచరిస్తున్న రాహువు వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభ వార్తలు వినే సూచనలు ఉన్నాయి కానీ, వివాహ ప్రయ త్నాలలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవ సరం. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఉత్తర నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రవి, బుధ, శని, గురు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. విదేశీ సంబంధమైన ఆటంకాలు తొలగడం, సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. సంపాదన బాగా పెరిగే సూచనలున్నాయి. నెలలో మొదటి పదిహేను రోజులు అనేక విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలతో ముందుకు వెడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యులైన వ్యక్తులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఎదుగుదల ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. రహస్య శత్రువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రాశినాథుడైన శుక్ర గ్రహం వక్రించడం, శత్రు స్థానాలలో సంచరిసూ ఉండడం వల్ల అనవసర పరిచయాలు ఏర్పడడం, తరచూ అనారోగ్యానికి గురికావడం వంటివి జరిగే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వారికి సమయం మరింతగా బాగుంది.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశివారికి ప్రస్తుతానికి రాహు, కుజ గ్రహాల సంచారం మాత్రమే అనుకూలంగా ఉంది. మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధన కారకుడైన గురు గ్రహం అనుకూలంగా లేనందువల్ల ఆర్థిక సమస్యలతో కొద్దిగా ఇబ్బంది పడక తప్పదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో మరింతగా సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల సమస్యలు బాగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం కాస్తంత బాగుండవచ్చు. కోపతాపాల వల్ల కుటుంబంలో కలతలు రేగే సూచనలున్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొం టారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. అనూరాధ నక్షత్రం వారి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గురు, శని గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల, ఏ ప్రయత్నం తలపెట్టినా దిగ్వి జయంగా పూర్తవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన బాకీలు, బకా యీలన్నీ వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ ఆలోచనలు, సూచనలు, సలహాల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తారు. కొత్త వ్యాపారాలు చేపట్టడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారా లను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రంవారికి ఆశించిన శుభవార్త అందు తుంది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శని, శుక్ర, బుధ గ్రహాలు చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల , వృత్తి, ఉద్యోగాలలో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకునే సూచనలున్నాయి. వ్యాపారాల్లో కూడా లాభాల శాతం పెరుగుతుంది. ముఖ్యంగా నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులకు అండగా నిలబడడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. గతంలో విమర్శలు చేసిన వారి నుంచి సైతం ప్రశంసలు లభిస్తాయి. దాదాపు నెలంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడం, అధికారుల నుంచి ప్రోత్సాహం లభించడం, ఆదాయ మార్గాలు సజావుగా ముందుకు సాగిపోవడం వంటివి జరుగుతాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉత్తరాషాఢ వారికి కాలం మరింతగా అనుకూలిస్తుంది.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): బుధ, రాహు గ్రహాలు కొద్దిగా అనుకూలంగా ఉన్నందువల్ల సంపాదన పెరగడానికి, ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి అవకాశం ఉంది. ఈ రాశిలో సంచరిస్తున్న శనీశ్వరుడు వక్రించడం వల్ల అనవ సర పరిచయాలు ఏర్పడడం, నమ్మినవారి వల్ల నష్టపోవడం, కొన్ని విషయాలలో ఆశా భంగం చెందడం, శ్రమ, తిప్పట ఎక్కువ కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతుంటాయి.
వృత్తి, ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో చికాకులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇందుకు సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నందువల్ల వీటి మీదే దృష్టి
కేంద్రీకరించడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పూర్వాభాద్రవారు ఆశించిన శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): బుధ, రాహు గ్రహాలు కొద్దిగా అనుకూలంగా ఉన్నందువల్ల సంపాదన పెరగడానికి, ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి అవకాశం ఉంది. ఈ రాశిలో సంచరిస్తున్న శనీశ్వరుడు వక్రించడం వల్ల అనవ సర పరిచయాలు ఏర్పడడం, నమ్మినవారి వల్ల నష్టపోవడం, కొన్ని విషయాలలో ఆశా భంగం చెందడం, శ్రమ, తిప్పట ఎక్కువ కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో చికాకులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇందుకు సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నందువల్ల వీటి మీదే దృష్టి కేంద్రీకరించడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పూర్వాభాద్రవారు ఆశించిన శుభవార్తలు వింటారు.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ప్రస్తుతానికి రాశినాథుడైన గురు గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ నెలంతా జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందు లేమీ ఉండవు. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. గురు గ్రహ అనుగ్రహం వల్ల కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా, సామరస్యంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం
పరవాలేదనిపిస్తుంది. ఇతరులకు సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సొంత ఊరికి వెళ్లడం, చిన్ననాటి స్నేహితులనో, బంధువులనో కలుసుకోవడమో జరుగుతాయి. భావ సారూప్యత కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. రహస్య శత్రువులు తయారయ్యే సూచనలు ఉన్నాయి. రేవతి నక్షత్రంవారికి అదృష్టం పడుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ప్రస్తుతానికి రాశినాథుడైన గురు గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ నెలంతా జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందు లేమీ ఉండవు. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. గురు గ్రహ అనుగ్రహం వల్ల కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా, సామరస్యంగా ముందుకు సాగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరులకు సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సొంత ఊరికి వెళ్లడం, చిన్ననాటి స్నేహితులనో, బంధువులనో కలుసుకోవడమో జరుగుతాయి. భావ సారూప్యత కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. రహస్య శత్రువులు తయారయ్యే సూచనలు ఉన్నాయి. రేవతి నక్షత్రంవారికి అదృష్టం పడుతుంది.

12 / 12
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?