- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips planting these trees in front of the house is prohibited know what is its bad effect in telugu
Vastu Tips For Plants: ఇంటి ఆవరణలో అందం కోసం ఈ మొక్కలు పెంచుతున్నారా.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..
మొక్కలకు మానవ జీవితానికి విడదీయరాని బంధం ఉంది. అంతేకాదు జ్యోతిష్యం, సనాతన వేద గ్రంథాలతో పాటు, ఆయుర్వేద వైద్యంలో కూడా చెట్లు, మొక్కలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడ్డాయి. ఆయుర్వేద ఔషధాలన్నీ చెట్లనుంచి లభిస్తాయి. మరోవైపు జ్యోతిషశాస్త్రంలో చెట్లు, మొక్కల వాస్తు నివారణలు, ప్రయోజనాలను పేర్కొన్నారు. సనాతన ధర్మంలో ప్రకృతి విశిష్టతను తెలియజేస్తూ ప్రతి ఇంటి ఆవరణలో కొన్ని మొక్కలు నాటాలని తెలిపింది. అదే సమయంలో కొన్ని రకాల మొక్కలు నాటడాన్ని నిషేధించారు. ఈ రోజు ఏ మొక్కలను ఇంటి ఆవరణలో లేదా.. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా పెంచకూడదో తెలుసుకుందాం..
Updated on: Aug 01, 2023 | 12:16 PM

ఇంటి చుట్టూ వివిధ రకాల చెట్లు, మొక్కలు అందాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తాయి. అయితే కొన్ని రకాల చెట్లు ఆ కుటుంబంపై ప్రభావం చూపుతాయి. తులసి, జమ్మి వంటి మొక్కలను ప్రతి ఇంట్లో నిర్దేశించిన దిశలో పెంచుకోవచ్చు. అదే సయమంలో ఇంట్లో అందం కోసం అంటూ ముళ్ల మొక్కలను పెంచుకోవడం నిషేధం.

అంతేకాదు ఇంటి లోపల లేదా వెలుపల చెట్లు, మొక్కలు నాటేటప్పుడు వాస్తు శాస్త్రంతో పాటు జ్యోతిషశాస్త్ర సూత్రాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి ముందు లేదా పెరట్లోనైనా పాలు కారే చెట్టును నాటడం అ శుభంగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు.. జిల్లేడు, సపోటా వంటి పాలు కారే చెట్టును ఇంటి వెలుపల లేదా ప్రాంగణంలో పెంచకూడాదు.

ఇంటి ముందు రేగు చెట్టును నాటడం కూడా నిషేధించబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ చెట్టు మానసిక ఒత్తిడిని సృష్టిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, మానసిక ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడతాయి.

ఇంటి ద్వారం ఎదురుగా గులాబీ మొక్కను పెంచరాదు. ఇది రాహువు సమస్యలను పెంచుతుంది. మరోవైపు ఇంటి ముందు మర్రి చెట్టు ఉండడం వల్ల కుటుంబ సభ్యుల వివాదాలు నెలకొని బంధంలో చీలిక వస్తుంది. కుటుంబ కలహాలు పెరుగుతాయి.

చింత చెట్టును ఇంటి ముందు లేదా ప్రవేశ ద్వారం వద్ద కూడా నాటకూడదు. ఇది వైవాహిక జీవితంలో అడ్డంకులు సృష్టిస్తుంది. ఖర్జూర చెట్టు పేదరికాన్ని ఇస్తుంది. కనుక ఈ చెట్టుని ఇంట్లో లేదా చుట్టుపక్కల నాటకూడదు. అదే సమయంలో రావి చెట్టును ఇంట్లో నాటకూడదు. ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.





























