- Telugu News Photo Gallery Overtaking of Mushrooms may cause these health problems, check to know the details
Mushrooms: పుట్టగొడులతో ప్రయోజనాలే కాదు, ప్రాణాంతకం కూడా.. పరిమితి దాటిందంటే ఇక అంతే..
పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి. శరీరానికి కావాలసిన పోషకాలు ఎన్నో పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉన్నందున ఇవి ఆరోగ్యాన్ని కాపాడే శక్తిని కలిగి ఉంటాయి. అయితే పుట్టగొడుగులను నిత్యంగా లేదా ఎక్కువగా తింటే కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా నిపుణులు ప్రకారం కొన్ని పుట్టగొడుగులలో రాఫినోస్, మన్నిటోల్ వంటి జీర్ణక్రియపై ఒత్తిడి పెంచే పిండి పదార్థాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి జీర్ణం కాకుండా పెద్ద ప్రేగులోకి ప్రవేశించి గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురయ్యేలా చేస్తాయి.
శివలీల గోపి తుల్వా | Edited By: Ravi Kiran
Updated on: Aug 02, 2023 | 1:48 PM

ఆరోగ్యానికి ప్రయోజనకరమైన పుట్టగొడుగుల్లో అధిక ఫైబర్, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇంకా వీటిల్లో విటమిన్ బి, డి, కాపర్, పొటాషియం, ఐరన్, సెలీనియం వంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి.

ఈ కారణంగా పుట్టగొడుగుల ఎముకలను దృఢంగా చేయడంతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడంలో, కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.

అయితే పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉన్నందున వీటిని మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి మంచింది. లేదంటే శరీరంలో పోషకాల అసమతుల్యత ఏర్పడి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో ప్రాణాంతక పరిస్థితిగా కూడా పరిణమించవచ్చు.

ఇంకా నిపుణులు ప్రకారం కొన్ని పుట్టగొడుగులలో రాఫినోస్, మన్నిటోల్ వంటి జీర్ణక్రియపై ఒత్తిడి పెంచే పిండి పదార్థాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి జీర్ణం కాకుండా పెద్ద ప్రేగులోకి ప్రవేశించి గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురయ్యేలా చేస్తాయి.

ఇంకా పుట్టగొడుగులను నిత్యం తీసుకునేవారిలో మానసిక ఆరోగ్యం స్థిమితంగా ఉండదని, వారు తరచూ భయం, ఆందోళనను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు.

అలాగే పుట్టగొడుగులను అమితంగా తీసుకోవడం వల్ల వికార, విపరీతమైన ఆవలింత సమస్యలు ఎదురవుతాయి.





























