AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. జూన్ నెల కోటా శ్రీవారి సేవ టికెట్లు విడుదల..! కొత్తగా మరో అవకాశం..

తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా టికెట్లు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి. శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులకు భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సేవలో నాణ్యతను పెంచేందుకు టీటీడీ పలు మార్పులు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

Tirumala: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. జూన్ నెల కోటా శ్రీవారి సేవ టికెట్లు విడుదల..! కొత్తగా మరో అవకాశం..
Ttd
Jyothi Gadda
|

Updated on: Apr 29, 2025 | 8:02 AM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి సేవ కోసం ఎదురు చూస్తున్న భక్తులకు అద్భుత అవకాశం మళ్ళీ రానుంది. తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా టికెట్లు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి. అయితే, శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులకు భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సేవలో నాణ్యతను పెంచేందుకు టీటీడీ పలు మార్పులు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా టికెట్లు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు సాధారణ సేవ, 12 గంటలకు నవనీత సేవ (మహిళలకే), 1 గంటకు పరకామణి సేవ (పురుషులకే), మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ లీడర్ సేవ టికెట్లు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేసిన వారై ఉండాలని చెప్పారు. వయస్సు 45 సంవత్సరాలు నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్న వారు నమోదు చేసుకోవచ్చు అన్నారు. వీరు 15 రోజులు, ఒక నెల లేదా మూడు నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే, వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి సుమారుగా 8 గంటల సమయం పడుతోంది. భక్తులు డైరెక్ట్ లైన్‌లోనే స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. నిన్న 65,904 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 24,487 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.53 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..