AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? చాలామందికి తెలియని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఇవిగో..

మన దేశంలోవేలకొద్దీ పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ, చాలా మందికి తెలియనివి కూడా అనేకం ఉన్నాయి. అవి ప్రపంచ వింతలకు ఏమాత్రం తీసిపోవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన అద్భుతాలు కొన్నైతే మానవ నిర్మిత అందాలు మరికొన్ని. అయితే,ఈ సమ్మర్లో మీరు కూడా ఏదైనా టూర్‌ ప్లాన్‌ చేస్తున్నట్టయితే..ఆ ప్రదేశాలేంటో, వాటి విశిష్టతలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సమ్మర్‌ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? చాలామందికి తెలియని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఇవిగో..
Destinations
Jyothi Gadda
|

Updated on: Apr 28, 2025 | 1:45 PM

Share

ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉన్నమాట వాస్తవం.. అలాగే..మన భారత దేశంలో అనేక అద్భుతమైన, అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వేలకొద్దీ పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ, చాలా మందికి తెలియనివి కూడా అనేకం ఉన్నాయి. అవి ప్రపంచ వింతలకు ఏమాత్రం తీసిపోవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన అద్భుతాలు కొన్నైతే మానవ నిర్మిత అందాలు మరికొన్ని. అయితే,ఈ సమ్మర్లో మీరు కూడా ఏదైనా టూర్‌ ప్లాన్‌ చేస్తున్నట్టయితే..ఆ ప్రదేశాలేంటో, వాటి విశిష్టతలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

– జీరో వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్‌లో జీరో వ్యాలీ ఉంది. ప్రశాంతత, పచ్చని పొలాలు, గ్రామాలు, ప్రత్యేకమైన అపటాని గిరిజన సంస్కృతి పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఎగుడు.. దిగుడు కొంత ప్రాంతాలు.. వాటి మధ్యలోంచి పారుతున్న నీటి కాల్వలు, పచ్చని చెట్లు, పక్షుల కిల కిల రావాలు..పర్యాటకుల్ని కట్టి పడేస్తుంటాయి. దీనిచుట్టు పక్కల అనేక గిరిజన తెగలకు చెందినవారు నివసిస్తుంటారు. వీరి సంస్కృతి, సంప్రదాయం, భాష, మాండలికం, జీవన శైలి చూడముచ్చటగా ఉంటాయని పర్యాటక నిపుణులు అంటున్నారు.

– గోకర్ణ కర్ణాటకలో గోకర్ణ ఉంది. అందమైన బీచ్‌లకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహాబలేశ్వర దేవాలయాలు చూడటానికి చాలా బాగుంటాయి. చాలా మంది వెకేషన్లకు గోకర్ణ వెళుతున్నారు. దీంతో ఫేమస్ డిస్టినేషన్ అయింది. బీచ్‍లు, పురాతన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు గోకర్ణ పరిసరాల్లో ఉన్నాయి. విభిన్న రకాల సీఫుడ్స్ కూడా ఇక్కడ పాపులర్. ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే గోకర్ణ వెకేషన్‍కు వెళ్లేందుకు చాలా మంది ప్లాన్ చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి

– స్పితి వ్యాలీ హిమాచల్ ప్రదేశ్‌లో ఈ స్పితి వ్యాలీ ఉంది. ఇక్కడ పురాతన మఠాలు, ఎత్తైన కొండ దారులు, ప్రకృతి అందాలు మైమరపిస్తాయి. మోడ్రన్ లైఫ్ స్టైల్ కి దూరంగా ఈ గ్రామాలు ఉండటం విశేషం. ప్రతి ఒక్కరికి హిమాచల్ ప్రదేశ్ అంటే వెంటనే షిమ్లా, కులు, మనాలీ వంటి ప్రధాన పర్యాటక ప్రదేశాలే గుర్తొస్తాయి. కొండ కోనలు, వయ్యారాలు ఒలికే లోయలు, హిమాలయ పర్వతాలకు ఇవి కేరాఫ్ అడ్రస్. శీతాకాలంలో అక్కడి అందాలను మాటల్లో వర్ణించడం కష్టం. అయితే, అవే కాకుండా హిమాచల్‌లో చూడాల్సిన మరో మరో అద్భుతమైన ప్రదేశం స్పితి వ్యాలీ.

– మజులి అస్సాంలో బ్రహ్మపుత్ర నదిలో ఉన్న మజులి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. ఇక్కడ సంస్కృతి, ప్రత్యేకమైన పండుగలు, ప్రకృతి అందాలకు ఎవరైనా మంత్రముగ్ధులవుతారు. అలాగే ఇదో జిల్లాగానూ ప్రత్యేకత సాధించింది. ఈ ప్రాంతం సహజ సిద్ధమైన ప్రకృతి సోయగాలకు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నెలవు.

– తీర్థన్ వ్యాలీ తీర్థన్ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఉంది. స్వచ్ఛమైన నదులు, అందమైన దారులు, పచ్చని పచ్చిక బయళ్లకు ఇది ఫేమస్.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
'ధురంధర్'కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..