Goat Blood: మేక రక్తం తింటున్నారా..? శరీరంలో జరిగే మార్పులేంటో తెలిస్తే..
మనలో మటన్ ప్రియులు ఎక్కువ మంది ఉంటారు. శరీరానికి అవసరమైన పోషక విలువలు ఉన్న పౌష్టిక ఆహారంగా మటన్ ను చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అలాగే, మటన్ లో బి 1, బి 2, బి 3, ,బీ6,బీ 12 విటమిన్ లు ఉంటాయి. కానీ, మేక రక్తం తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా..? మేక రక్తంలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం

భోజన ప్రియులకు నాన్ వెజ్ అంటే మరీంత ఇష్టంగా తింటుంటారు. మరీ ముఖ్యంగా మటన్ అంటే చెవి కొసుకునేవారు కూడా ఉంటారు. మటన్‌ని వివిధ రకాలుగా వండుకొని తింటారు. మటన్ రక్తం, కాలేయం, పేగులు, తలకాయ, మెదడు ఇలా మేకలోని అన్ని అవయవాల్ని దేనికదే స్పెషల్‌గా వండుకుని లాగించేస్తుంటారు. ఇందులో రక్తం వేపుడు, దాని రుచి కారణంగా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కానీ, మేక రక్తం తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా..? మేక రక్తంలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం
మటన్ తినడం ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మాత్రం మటన్ తినడం మంచిది కాదని చెబుతున్నారు. మటన్ లో చాలా పోషకాలు ఉంటాయి. అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషక విలువలు ఉన్న పౌష్టిక ఆహారంగా మటన్ ను చెబుతున్నారు. అలాగే, మటన్ లో బి 1, బి 2, బి 3, ,బీ6,బీ 12 విటమిన్ లు ఉంటాయి. విటమిన్ ఈ, విటమిన్ కె, సహజమైన ఫ్యాట్స్ తో పాటు కొలెస్ట్రాల్, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం , జింక్, ఫాస్ఫరస్, కాపర్, సెలీనియం, అమైనోయాసిడ్స్, ప్రోటీన్లు, న్యూట్రియంట్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే, మేక రక్తంతో చేసిన వంటకాన్ని నల్ల అని కూడా పిలుస్తారు..దీనిని తినటం వల్ల కూడా ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల తినటం వల్ల ఏమౌతుందంటే.. మేక రక్తంలో హిమోగ్లోబిన్, ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇందులో 17 రకాల ఆమ్లాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మేక రక్తం చాలా పోషకాలతో నిండి ఉన్నప్పటికీ, దానిలో ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కాబట్టి బాగా శుభ్రం చేసి, బాగా వేయించిన తర్వాతే వండుకుని తినటం మంచిదని సూచిస్తున్నారు. మేక రక్తంలో పురిన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గట్ సమస్య ఉన్నవారికి ఇబ్బంది రావచ్చు అంటున్నారు. అలాగే మేక రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల, తరచుగా తినేటప్పుడు ఐరన్ అధికంగా ఉండి, అది శరీరంలో చాలా సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఏదైనా మితంగా తింటేనే దాని వల్ల ప్రయోజనం అంటున్నారు నిపుణులు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








