AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peaches: పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..? వారం రోజులు తిని చూడండి..

పీచ్‌ పండు దీనిని స్టోన్ ఫ్రూట్, పర్షియన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. పసుపు, తెలుపు రంగులో ఉండే ఈ పండుతో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని నేరుగా లేదంటే.. జ్యూస్ రూపంలో కూడా తినొచ్చు. తరచూ పీచ్‌ఫ్రూట్‌ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఊహించని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం ..

Jyothi Gadda
|

Updated on: Apr 28, 2025 | 10:49 AM

Share
పీచ్‌ పండులో విటమిన్స్‌, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పీచ్‌ పండు కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ పండులో విటమిన్ ఏ తో పాటు బీటా కెరోటీన్‌ కూడా పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన కంటి చూపును మెరుగుపరిచి ఇది క్యాటరాక్ట్ సమస్యలు రాకుండా నివారిస్తుంది.

1 / 5
బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన పండు. కేలరీలు తక్కువగా ఉండే పీచ్‌ పండు తినటం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంచుకొవచ్చు అంటున్నారు నిపుణులు. పోషకాలు పుష్కలంగా ఉంది, ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

2 / 5
పీచ్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల అధిక తినాల్సిన కోరిక రాదు. అయితే ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.. అంతేకాదు డయేరియా, మలబద్దక సమస్యలను దరిచేరకుండా చేస్తుంది.. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది.

3 / 5
పీచ్‌ పండు క్యాన్సర్ కణాలు అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. మోనోపోజ్ మహిళలు రోజుకు కనీసం రెండు పీచు పండ్లు అయినా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.. అంతేకాదు పీచ్‌ పండులో పాలిఫెనల్స్, యాంటీ  ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది నొప్పి సమస్యలను తగ్గించుతాయి.

4 / 5
పీచెస్ రక్తపోటును, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలో హిస్టమైన్ ఉత్పత్తిని నిరోధించి, అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫోలేట్ ప్రెగ్నెన్సీ మహిళలకు కూడా మేలు చేస్తుంది. పీచ్‌ పండ్లను నేరుగా తినవచ్చు.. లేదా స్మూథీ రూపంలో తీసుకోవచ్చు. ఇది మన చర్మ ఆరోగ్యకరమైన కనిపించేలా చేస్తుంది.

5 / 5