AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ కిందికి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి, ఇద్దరికి సీరియస్!

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వస్తూ ఐదుగురు మృతి చెందారు. ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప్పరెడ్డిపల్లి శివారులో జరిగింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ కిందికి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి, ఇద్దరికి సీరియస్!
Road Accident In Tirupati District
Balaraju Goud
|

Updated on: Apr 28, 2025 | 4:45 PM

Share

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వస్తూ ఐదుగురు మృతి చెందారు. ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప్పరెడ్డిపల్లి శివారులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాకాల రోడ్డు ప్రమాదానికి గురైన వారిని తమిళనాడుకు చెందినవారుగా గుర్తించారు పోలీసులు. తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరిన ఏడుగురు వ్యక్తులు, పాకాల వద్ద కారు ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీని బలంగా ఢీకొట్టారు. దీంతో కారు.. కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. కారు పూర్తిగా నుజ్జునుజ్టు అయ్యింది. దీంతో ఐదుగురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో వృద్ధుడు, ఒక చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంటైనర్ కింద చిక్కుకున్న కారు అతికష్టం మీద బయటకు తీసిన పోలీసులు, మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
రోజూ ఇది ఒక్కటి తింటే చాలు.. 51 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా..
రోజూ ఇది ఒక్కటి తింటే చాలు.. 51 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్ గా..
అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్
అంతర్జాతీయ వేదికపై మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
రేపట్నుంచే బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. గట్టెక్కుతారా
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!