చాణక్య నీతి : ఇంటిలో సమస్యలు సృష్టించే వ్యక్తులు వీరే

Samatha

4 August 2026

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా వివరంగా తెలియజేయడం జరిగింది.

అంతే కాకుండా చాణక్యుడు, చాణక్య నీతి అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే మంచి విషయాలను తెలిపాడు. అవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.

అయితే చాణక్యుడు అందులో భాగంగానే  ఇంటిలో సమస్యలు సృష్టించే కొంత మంది వ్యక్తుల గురించి తెలియజేయడం జరిగింది.  ఇంతకీ వారు ఎవరంటే?

కఠినమైన మాటలను ఎవరు అయితే ఎక్కువగా మాట్లాడుతారో, అలాగే ఎగతాళి చేస్తుంటారో, వారి వలన ఇంటిలోని వారు ఒకరిని ఒకరు నిందించుకొని దూరం అవుతారంట.

కఠినమైన మాటలన వలన బంధాలు క్షీణించి,  దూరం పెరిగి, ఇంటిలో సంతోషం దూరం అవుతుందని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు.

ఆచార్య చాణక్యుడి ప్రకారం , చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం కూడా అస్సలే మంచిది కాదు అని చెబుతున్నాడు. చాణక్యుడు ఇది కూడా బంధాలను బలహీనపరుస్తుంది.

అలాగే చాణక్యుడు నమ్మకం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఏ బంధానికి అయినా సరే నమ్మకమే పునాదని ఆయన అంటున్నారు.

కుటుంబ సభ్యుల్లో ఒకరి మీద ఒకరికి మంచి నమ్మకం ఉండాలి. అది లేకపోతే, ఆ ఇంటిలో సంతోషం దూరం అవుతుందని చాణక్యుడు చెబుతున్నాడు.