Tirupati IISER: తిరుపతి ఐఐఎస్ఈఆర్‌కు రూ.1491.34 కోట్లు.. వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం వివరణ..
IISER in Tirupati: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) నిర్మాణం, ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి
IISER in Tirupati: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) నిర్మాణం, ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1491.34 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది. తిరుపతి ఐఐఎస్ఈఆర్ (IISER Tirupati) గురించి లోక్‌సభలో వైఎస్సార్సీపీ (YSRCP MPs) ఎంపీలు చింత అనురాధ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డా.సుభాష్ సర్కార్ (subhas sarkar) సోమవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తిరుపతిలో 2015లో ఈ విద్యా సంస్థ (IISER) ను ఏర్పాటు చేశామని వివరించారు. శాశ్వత క్యాంపస్ నిర్మాణం కోసం కేంద్ర మంత్రివర్గం రూ.1491.34 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఇందులో మూలధనం కింద రూ. 1137.16 కోట్లు, పునరావృతమయ్యే ఖర్చుల కోసం రూ. 354.18 కోట్లు కేటాయించినట్లు సుభాష్ సర్కార్ తెలిపారు.
2018 మే నెలలో శాశ్వత క్యాంపస్ నిర్మాణం మొదలైందని తెలిపారు. విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణం 2020 ఆగస్టులో పూర్తయిందన్నారు. అండర్‌గ్రాడ్యుయేట్ ల్యాబ్ నిర్మాణం 2019 జూన్‌లో మొదలై.. 2020 అక్టోబర్‌లో పూర్తయిందని పేర్కొన్నారు. ఇతర ప్రధాన భవనాల నిర్మాణం 2020 అక్టోబర్‌లో మొదలై.. ప్రస్తుతం కొనసాగుతున్నాయని వివరించారు. అవి కూడా సకాలంలో పూర్తవుతాయని వెల్లడించారు.
Also Read: