Watch Video: టీడీపీకి షాక్ ఇచ్చిన మహిళా నేత.. రాజీనామాతో కంగుతిన్న క్యాడర్..
ఎన్నికల వేళ తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీకి షాక్ తగిలింది. బొజ్జల సుధీర్‌రెడ్డి మానసికంగా వేధిస్తున్నారంటూ తిరుపతి తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఏపీలో ఎన్నికల రాజకీయం హీట్ పుట్టిస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
ఎన్నికల వేళ తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీకి షాక్ తగిలింది. బొజ్జల సుధీర్‌రెడ్డి మానసికంగా వేధిస్తున్నారంటూ తిరుపతి తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఏపీలో ఎన్నికల రాజకీయం హీట్ పుట్టిస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. వివిధ పార్టీల్లో ఉన్న నేతలను కూడా దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ.. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం టీడీపీకి సీన్ రివర్స్ అయింది. ఎన్నికల రాజకీయం మాంచి ఊపుమీదున్న వేళ తిరుపతి పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు, శ్రీకాళహస్తికి చెందిన చక్రాల ఉష రాజీనామా చేయడం షాకిస్తోంది.
టీడీపీ సభ్యత్వంతోపాటు.. పార్టీ పదవులకు రాజీనామా చేశారు. అయితే.. తన రాజీనామాకు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డే కారణమని చక్రాల ఉష ఆరోపించడం కాక రేపుతోంది. మానసికంగా వేధిస్తూ.. అవమానిస్తోన్న సుధీర్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయలేకనే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్న తనకు మంచి పేరు వస్తుందన్న ఈర్ష్యతోనే బొజ్జల సుధీర్‌రెడ్డి అన్ని విధాలా ఇబ్బంది పెట్టారన్నారు. ఇక.. రాజీనామా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు క్షమించాలంటూ కన్నీరు పెట్టుకున్నారు చక్రాల ఉష. మొత్తంగా.. బొజ్జల సుధీర్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తూ తెలుగు మహిళా నేత చక్రాల ఉష రాజీనామా చేయడం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై తిరుపతి టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఉష పూర్తి వీడియో..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..