CM Jagan: ‘పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా’.. వెంకటగిరి ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్..

పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చడంతో పాటు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని కోరారు జగన్‌. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయనతో పాటు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి పాల్గొన్నారు.

CM Jagan: 'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరి ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్..
Cm Jagan
Follow us

|

Updated on: Apr 28, 2024 | 9:21 PM

పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చడంతో పాటు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని కోరారు జగన్‌. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయనతో పాటు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదని.. వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టు కట్టి దొంగ హామీలిచ్చి ప్రజలను వంచించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌.. సూపర్‌ టెన్‌ అంటూ నమ్మబలుకుతున్నారని విమర్శించారు జగన్‌. మళ్లీ అదే కూటమి.. మళ్లీ అదే సంతకం.. మళ్లీ అవే మోసాలు.. హిస్టరీ రిపీట్‌ అంటూ మండిపడ్డారు. చంద్రబాబును ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుందని..లకలకలక అంటూ పేదల రక్తం తాగుతుందని సెటైర్లు వేశారు సీఎం జగన్. చంద్రబాబుకు ఓటేస్తే పశుపతిని ఇంటికి తెచ్చుకున్నట్టే అని కామెంట్ చేశారు. చంద్రబాబును నమ్మడమంటే పులినోట్ల తలపెట్టడమే అని కామెంట్ చేశారు.

58 నెలలు పాలించిన తన పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తొస్తాయన్న జగన్‌.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు తీసుకొస్తే.. తాను గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చానని చెప్పారు. చంద్రబాబు దమ్ముంటే తాను గెలిస్తే మళ్లీ జన్మభూమి కమిటీలను తీసుకొస్తానని చెప్పగలరా అని సవాల్ చేశారు. వలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థలు గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్ధం చెబుతున్నాయన్నారు జగన్‌. తన 58 నెలల పాలనలో ప్రభుత్వ పథకాలు లంచాలు, వివక్ష లేకుండా అందరికీ అందాయని.. ఐదేళ్లకు ముందు ఈ పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు.. తన పాలన చేసిన ఒక్క మంచిపనైనా చూపించి ఓట్లు అడిగే సత్తా ఉందా అని ప్రశ్నించారు జగన్‌. తన ఐదేళ్ల పాలనలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో పాటు.. 2 లక్షల 30వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం జగన్‌. సామాజిక న్యాయానికి అసలైన అర్థం చెప్పామన్న సీఎం.. 75శాతం పథకాలు పేద వర్గాలకే అందాయన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు ఎగ్గొట్టిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు.

ప్రచారం వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు