Tirumala: తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం
తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుకుంటున్నాయి. స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం ఘనంగా నిర్వహించబడింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు చక్రత్తాళ్వార్ స్నానం, చక్రస్నానం ప్రధాన ఘట్టంగా జరిగింది. పంచామృతాలతో అభిషేకాలు, పూజాకార్యాలు శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం వరకూ భక్తులు పుణ్యస్నానాలు చేయవచ్చు.

తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. ఈ ఘట్టమంతా వైభవోపేతంగా, కన్నులపండువగా సాగింది.
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం, చక్రస్నానంతో ఉత్సవాల్లో మరో కీలక క్రతువు పూర్తయింది. పంచామృతాలతో అభిషేకాలు, పూజాకైంకర్యాలు అన్నీ శాస్త్రోకంగా సాగాయి.. ఇవాళరోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయి కాబట్టి.. భక్తులంతా సాయంత్రం వరకూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుంటుంది..!
ఇక రాత్రి 7:30 గంటలకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. ఆలయ ధ్వజస్తంభంపై ఎగురవేసిన గరుడ ధ్వజాన్ని అవరోహించడంతో ఈ మహోత్సవం ముగుస్తుంది. బ్రహ్మదేవుడు స్వయంగా ప్రారంభించినట్టు పురాణాల్లో పేర్కొన్న ఈ ఉత్సవాల్లో పాల్గొని మలయప్పను దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు పోటెత్తారు. వివిధ వాహన సేవలు, రథోత్సవం వంటి కార్యక్రమాలు భక్తిప్రపత్తులతో తిలకించి పరవశించిపోయారు.




