అయ్యో దేవుడా.. ఒక్క 10 నిమిషాలు ఆలస్యంగా వాన కురిస్తే మూడు ప్రాణాలు దక్కేవి..

ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వాన కురుస్తుండడంతో.. వాళ్లంతా చెట్టు కిందకు పరుగున వెళ్లారు.. వర్షం నుంచి కొంచెం తడవకుండా ఉంటే చాలనుకున్నారు. కానీ వారికి అదే శాపం అయింది.. తడవడం సంగతి పక్కన పెడితే.. పిడుగు పడి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. పిడుగుపాటుతో చెట్టు కింద ఉన్న ఒక మహిళ.. బాబు, అక్కడే ఉన్న మరో వ్యక్తి.. ఇలా ముగ్గురూ మరణించారు.

అయ్యో దేవుడా.. ఒక్క 10 నిమిషాలు ఆలస్యంగా వాన కురిస్తే మూడు ప్రాణాలు దక్కేవి..
Ap Rains
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 03, 2024 | 9:46 PM

ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వాన కురుస్తుండడంతో.. వాళ్లంతా చెట్టు కిందకు పరుగున వెళ్లారు.. వర్షం నుంచి కొంచెం తడవకుండా ఉంటే చాలనుకున్నారు. కానీ వారికి అదే శాపం అయింది.. తడవడం సంగతి పక్కన పెడితే.. పిడుగు పడి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. పిడుగుపాటుతో చెట్టు కింద ఉన్న ఒక మహిళ.. బాబు, అక్కడే ఉన్న మరో వ్యక్తి.. ఇలా ముగ్గురూ మరణించారు. ఈ ఘటన కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు గ్రామంలో చోటుచేసుకుంది. పిడుగుపడి మహిళతో పాటు ఓ బాలుడు, యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కూలీ పని కోసం వెళ్ళగా.. వాతావరణం మారి వాన కురుస్తుండటంతో వాళ్లంతా చెట్టు కింద నిలబడదామని వెళ్లి ముగ్గురూ మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతులు శివపార్వతి (30) తేజేశ్వర్ రెడ్డి (10), మారుతి ప్రసాద్ రెడ్డి (30) గా పోలీసులు గుర్తించారు.

వాతావరణం ఒక్కసారిగా మారడంతోపాటు.. పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు. ఒక పది నిమిషాలు వాన ఆలస్యంగా పడి ఉంటే ఈ ముగ్గురు ఇళ్లకు చేరుకునే వారని.. ఈ క్రమంలోనే.. పిడుగులతో వాన పడటంతో ఇలా జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. సాయంత్రం ఐదున్నరకు ఈ ఘటన జరిగిందని.. ఒక్క పది నిమిషాలు ముందు బయలుదేరి ఉంటే ఆ ముగ్గురు ప్రాణాలు కాపాడుకునేవారని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వాన పడిన సమయంలో చెట్టు కిందకు వెళ్లడం… చెట్టుపై పిడుగు పడటం అకస్మాత్తుగా జరిగిపోయిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురూ పిడుగుపాటుతో మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది..

ఏది ఏమైనా ప్రజలందరూ వాన పడే సమయంలో చెట్లు కిందకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చెట్లు ఉన్న ప్రదేశంలో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రజలందరూ గ్రహించి వాన పడే సమయంలో చెట్టు కిందకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని గ్రహించాలి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్‌ చిందులు.. వీడియో వైరల్
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు
కంటైనర్‌లో కారు.. కారులో గుట్టలుగా నోట్ల కట్టలు